వైసిపి మరో స్కీమ్.. వాలంటీర్ల తరహాలో గ్రామ సారధులు
గురువారంనాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేసేలా పలు సూచనలు చేశారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా వైసీపిలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థను తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. దీనిలో భాగంగా గ్రామ సారధులను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రం మొత్తం మీద 5.20 లక్షల మంది గ్రామ సారధులను నియమించాలని జగన్ ఆదేశించారు. ప్రతి 50 ఇళ్లను ఒక క్లస్టర్ గా గుర్తించి, ప్రతి క్లస్టర్ కు ఇద్దరు గ్రామ సారధులు ఉండేలా చూడాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లును నియమించాలని ఆదేశించారు.
గురువారంనాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేసేలా పలు సూచనలు చేశారు. కష్టపడి పని చేయకుండా విజయాలు సాధించడం సాధ్యం కాదని అందువల్ల పార్టీ నేతలు ప్రతీ ఒక్కరూ కష్టపడి పార్టీ విజయానికి ప్లాన్ ప్రకారం పనిచేయాలని సూచించారు.
ఈ గ్రామ సారథుల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఒక రకంగా బూత్ లెవల్ కమిటీలు తయారైనట్టేనని ఆయన చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. బటన్ నొక్కి ఆ ఫలాలను ప్రజలకు అందించడం పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వ ప్రతి అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని దిశానిర్దేశం చేశారు.