మార్గదర్శి కేసులో శైలజా కిరణ్‌కు సీఐడీ నోటీసులు
ఈనెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఏదో ఒక రోజు మార్గదర్శి కేసులో విచారణ చేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆయా తేదీల్లో ఆమె అందుబాటులో ఉండాలని సూచించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఏ-2గా ఉన్న చెరుకూరి శైలజా కిరణ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిధుల మళ్లింపు వ్యవహారంపై ఏపీ సీఐడీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
శైలజా కిరణ్‌కు నోటీసులు జారీ చేసిన సీఐడీ డీఎస్పీ రవికుమార్ ఆమె విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కి ఎండీగా శైలజా కిరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈనెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఏదో ఒక రోజు మార్గదర్శి కేసులో విచారణ చేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆయా తేదీల్లో ఆమె అందుబాటులో ఉండాలని సూచించారు. ఇల్లు లేదా ఆఫీసులో అందుబాటులో ఉంటే సరిపోతుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో చెరుకూరి రామోజీరావు ఏ-1గా ఉన్నారు.