రామోజీరావుకి అవమానం..!

పాపం ఈనాడుని ఎవరు పట్టించుకున్నట్టు లేదు. రామోజీరావు ప్రచారాన్ని నమ్మినట్టు లేదెవరు! అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని 'ఈనాడు' నెత్తినోరు బాదుకుంటూ గగ్గోలు పెట్టినా, జగన్ సభకి ఆ జనం ఏమిటి?

Advertisement
Update: 2024-01-20 07:50 GMT

అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్ కు లేదని 'ఈనాడు' పూర్తి పేజీ కేటాయించి, నిరూపించి, నిర్ధారించినంత పని చేశాక, విజయవాడలో విగ్రహ ఆవిష్కరణ కి జనం నేల ఈనినట్టుగా, తండోపుతండాలుగా తరలివచ్చిన సుందర దృశ్యం చూసాం మనమంతా ఈ కళ్ళతోనే. పోలా, పరువు పోలా, ఈనాడు కి రామోజీ కి ఒకేసారి సిగ్గు పోలా!

ఆవిష్కరణ అటుంచి, అసలు అంబేద్కర్ విగ్రహం తాకడానికి జగన్ ఎవరు? అతనికున్న అర్హత ఏమిటి? అంటూ హీనంగా నీచంగా 'ఈనాడు' పూర్తి పేజీలో విరుచుకుపడి, తిట్టి, శపించిన రోజే జగన్మోహన్ రెడ్డి సభకి వేలల్లో లక్షల్లో జనం ఉత్సాహంగా రావడం, విజయవాడ పులకించి పోవడం, ఎంత పరాభవం రామోజీకి, ఈనాడుకి జమిలిగా! EDUCATE, AGITATE, ORGANISE అంటూ అంబేద్కర్ వెలుగులో బడుగు జనం పరవశించిపోయిన రోజిది - జనవరి 19 - ఈనాడు కి మాత్రం బ్లాక్ డే BLACKDAY!

పాపం ఈనాడుని ఎవరు పట్టించుకున్నట్టు లేదు. రామోజీరావు ప్రచారాన్ని నమ్మినట్టు లేదెవరు! అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని 'ఈనాడు' నెత్తినోరు బాదుకుంటూ గగ్గోలు పెట్టినా, జగన్ సభకి ఆ జనం ఏమిటి? ఉరకలెత్తే ఉత్సాహంతో పరుగులెత్తిన జనాన్ని చూస్తే, ఈనాడుకి పరువు లేదని రామోజీ మాటకి విలువలేదని ఇట్టే తెలిసిపోతుంది.

రాబోయే జగన్ గెలుపునకు ఇది సంకేతం, రామోజీ చంద్రబాబుకిది రామోజీ, చంద్రబాబులకు ఇది అశనిపాతం! ఇప్పుడు జగన్ గాలివీస్తున్నది. ఈ విజయం బాబు ముఠా గాలి తీస్తున్నది.

రామోజీకి గర్వభంగం. ఈనాడు దుష్ట ప్రచారం పట్టించుకున్న దిక్కే లేదు. జగన్ అనర్హుడు అని ప్రకటించింది 'ఈనాడు'. ఊగిపోతున్న జన సందోహం మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. చప్పట్లు ఆకాశాన్నితాకాయి, పేద జనం మొహంలో ఆనందం వికసించింది. చంద్రబాబుకి మైండ్ బ్లాంక్ అయింది. విజయవాడలో తెలుగుదేశం తెల్లబోయి చూస్తుంది.

గెలుపు కెరటాలపై జగన్. అవమానభారంతో రామోజీ! ఆధిపత్య కుల అహంకారం మీద, దళిత పతాకం ఉజ్వలంగా ఎగిరిన రోజది. దళితులుగా పుట్టాలని ఎవరనుకుంటారు? అని ఒక దరిద్రుడు అన్న కొన్ని సంవత్సరాల్లోనే విజయవాడ నడిబొడ్డున దళిత శ్రేణుల విజయోత్సవం ఉరకలెత్తింది. ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షకు ప్రతిరూపంగా ఆవిష్కరణ జరిగింది. ఇది రామోజీరావు కొచ్చిన పీడకల, చంద్రబాబు గుండెల్లో పేలిన టైం బాంబు. పరాజయం పిలుస్తుంది, రా! కదిలిరా!

Tags:    
Advertisement

Similar News