వైసీపీని వీడటానికి కారణమిదే.. మౌనం వీడిన రాయుడు

గుంటూరు లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశాడంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా వైసీపీని వీడటంపై వివరణ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు అంబటి రాయుడు.

Advertisement
Update:2024-01-07 18:29 IST

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వైసీపీలో చేరిన తొమ్మిది రోజుల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాజీనామా అంశాన్ని ట్వీట్‌ చేసినప్పటికీ.. అందుకు గల కారణాలను మాత్రం ఆ ట్వీట్‌లో చెప్పలేదు. దీంతో గుంటూరు లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశాడంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా వైసీపీని వీడటంపై వివరణ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు అంబటి రాయుడు.


త్వరలో యునైటెడ్‌ అరబ్ ఎమిరెట్స్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ T-20 ముంబై ఇండియన్స్ ఎమిరెట్స్‌ తరపున ఆడుతున్నానని ప్రకటించాడు అంబటి. ఈ ఫ్రాంచైజీ కూడా రిలయన్స్‌ గ్రూప్‌న‌కు చెందినదే. రాయుడు గతంలో ముంబై ఇండియన్స్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. అయితే ఈ ఇంటర్నేషనల్ లీగ్‌ T-20 టోర్నీలో ఆడాలంటే రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదనే నిబంధన వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు పరోక్షంగా వివరణ ఇచ్చాడు.

యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఈ ఇంటర్నేషనల్‌ లీగ్‌ T-20 ప్రారంభం కానుంది. జనవరి 20న దుబాయి కేపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ ఎమిరెట్స్‌ తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. నికోలస్ పూరన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Tags:    
Advertisement

Similar News