పవన్ నాలుగో పెళ్లి లోపు పోలవరాన్ని పూర్తిచేస్తాం.. పవన్ ఫ్యాన్స్‌కు అంబటి కౌంటర్

పవన్ గురించి అంబటి మాట్లాడిన ప్రతిసారి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? అని ఆయన ఫ్యాన్స్ అడగడం పరిపాటి కావడంతో దీనికి ఇవాళ అంబటి ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

Advertisement
Update:2022-10-21 12:03 IST
పవన్ నాలుగో పెళ్లి లోపు పోలవరాన్ని పూర్తిచేస్తాం.. పవన్ ఫ్యాన్స్‌కు అంబటి కౌంటర్
  • whatsapp icon

కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మంత్రి అంబటి రాంబాబుకు ట్విట్టర్ వేదికగా వార్ జరుగుతోంది. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై తగిన రీతిలో స్పందిస్తూ అంబటి రాంబాబు ట్వీట్లు చేస్తున్నారు. కాగా పవన్ రాజకీయంపై అంబటి ట్వీట్లు చేస్తుండగా.. ఆయనకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు.

అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన ప్రతిసారి ఆయన అభిమానులు పోలవరం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది..నీటిపారుదల శాఖ మంత్రి గారు? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇవాళ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. 'యుద్ధం అన్నాడు... సిద్ధం అన్నాడు తిరిగి చూస్తే కనిపించడే!' అని ట్వీట్ చేశారు. అంబటి అలా ట్వీట్ చేశాడో లేదో పవన్ ఫ్యాన్స్ కూడా అంబటికి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. 'పోలవరం ఎంతవరకు వచ్చింది. ఎప్పటికల్లా పూర్తవుతుందో అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?' అని సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.

పవన్ గురించి అంబటి మాట్లాడిన ప్రతిసారి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? అని ఆయన ఫ్యాన్స్ అడగడం పరిపాటి కావడంతో దీనికి ఇవాళ అంబటి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. 'పవన్ నాలుగో పెళ్లి లోపు పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత నాది' అని అంబటి ట్వీట్ చేశారు. అంబటి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    
Advertisement

Similar News