నా ప్రత్యర్థులకు ధన్యవాదాలు -అంబటి
అంబటి పంచ్ లు, ప్రత్యర్థి వర్గంపై ఆయన పేల్చే సెటైర్లు చూసేందుకే ప్రత్యర్థి వర్గం నుంచి ఎక్కువ మంది ఆయనకు ఫాలోవర్లు ఉంటారని చెబుతున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాత నాయకులు చాలామంది సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు కూడా ఎందుకో గ్యాప్ ఇచ్చారు. కానీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం వరుస ట్వీట్లతో సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ స్పెషల్ ట్వీట్ వేశారు. ట్విట్టర్లో తనకు లక్ష ఫాలోవర్లు దాటిన సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.
"లక్ష ఫాలోవర్స్ దాటిన సందర్భంగా..
ఫాలో అవుతున్న శ్రేయోభిలాషులకి, మిత్రులకి మరియు ప్రత్యర్థులకి హృదయపూర్వక ధన్యవాదాలు!" అంటూ ట్వీట్ వేశారు. మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పడం సహజం, కానీ అంబటి మాత్రం తన ప్రత్యర్థులకు కూడా థ్యాంక్స్ చెప్పడం ఇక్కడ విశేషం.
ఆసక్తికర సమాధానాలు..
అంబటి ట్వీట్ కి చాలామంది ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. అంబటి ట్విట్టర్ ని ఫాలో అయ్యే వారిలో అభిమానులకంటే ప్రత్యర్థులే ఎక్కువగా ఉంటారని, అందుకే ఆయన ప్రత్యర్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని అంటున్నారు. అంబటి పంచ్ లు, ప్రత్యర్థి వర్గంపై ఆయన పేల్చే సెటైర్లు చూసేందుకే ప్రత్యర్థి వర్గం నుంచి ఎక్కువ మంది ఆయనకు ఫాలోవర్లు ఉంటారని చెబుతున్నారు.
ట్రోలింగ్ కూడా..
మరోవైపు ట్రోలింగ్ బ్యాచ్ కూడా రెచ్చిపోతోంది. అంబటిపై నెగెటివ్ కామెంట్లు కూడా బాగానే పడుతున్నాయి. ఈ కామెంట్లను పక్కనపెడితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చే నాయకుల్లో అంబటి కూడా ఒకరు. యాక్టివ్ గా సెటైరిక్ ట్వీట్లు వేస్తుంటారు కాబట్టే ఆయన్ను లక్షమంది ఫాలో చేస్తున్నారు.