కానిస్టేబుల్ కొడుకువే కదా.. ఏంటి 'బ్రో' ఇది..?

ఆ గొడవల్లో చాలామంది పోలీసులకు గాయాలయ్యాయని, ఈ విషయం పవన్ కి తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులకు రక్తగాయాలు అయితే.. ఓ కానిస్టేబుల్ కొడుకుగా పవన్ కల్యాణ్ స్పందన ఏంటి..? అన్నారు మంత్రి అంబటి.

Advertisement
Update:2023-08-05 14:50 IST

పుంగనూరు ఘటనకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నీటిపారుదల ప్రాజెక్ట్ లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కావాలని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్ట్ ల గురించి, నీటి గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్నారు. అసలు రాజకీయ బ్రోకర్ చంద్రబాబేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి.

ఇంకా ఇంకా చేస్తారు..?

అధికారం లేకపోతే అల్లర్లకు దిగడం చంద్రబాబుకి అలవాటేనన్నారు అంబటి. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఏపీలో టీడీపీని ఎవరూ పట్టించుకోవట్లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యం అని తేలడంతోనే చంద్రబాబు ఇలా అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పారు. ఎన్నికలలోపు ఇంకా ఇంకా గొడవలు రేపుతారన్నారు. పుంగనూరులో సభకు అనుమతి లేదని తెలిసినా కూడా కావాలనే తుపాకులు, బాటిళ్లతో చంద్రబాబు అక్కడకు వచ్చారని, స్థానికేతరులతో కలసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పారు. చంద్రబాబు వల్లే గొడవ జరిగిందన్నారు మంత్రి అంబటి.


Full View

ఏంటిది 'బ్రో'..?

పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు సంధించారు మంత్రి అంబటి. పుంగనూరు ఘటనపై పవన్ స్పందిస్తూ పూర్తిగా చంద్రబాబుకు వత్తాసు పలికాడని అన్నారు అంబటి. అక్కడ గొడవలకు కారణం చంద్రబాబు అని స్పష్టంగా తెలుస్తున్నా, పవన్ మాత్రం ఆయనకు మద్దతివ్వడం దారుణం అన్నారు. ఆ గొడవల్లో చాలామంది పోలీసులకు గాయాలయ్యాయని, ఈ విషయం పవన్ కి తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులకు రక్తగాయాలు అయితే.. ఓ కానిస్టేబుల్ కొడుకుగా పవన్ కల్యాణ్ స్పందన ఏంటి..? అన్నారు. పదే పదే తాను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే పవన్, పుంగనూరులో పోలీసులు గాయపడితే పరామర్శించలేదని, కనీసం సానుభూతి కూడా తెలపలేదన్నారు మంత్రి అంబటి. 

Tags:    
Advertisement

Similar News