కూటమిలో నాలుగో పార్ట్ నర్.. అంబటి హాట్ ట్వీట్

కూటమిలో నాలుగో పార్ట్ నర్ గా ఏపీ పోలీస్ విభాగం కూడా చేరిందని విమర్శించారు అంబటి రాంబాబు. అలా ఆ నలుగురు కలసి ఫైట్ చేసినా ఇటువైపు ఉన్న జగనన్నదే విజయం అని తేల్చారు.

Advertisement
Update:2024-05-16 13:59 IST

ఈసారి ఏపీ రాజకీయాల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారంటూ ఎన్నికల ముందు రెడ్ బుక్ పట్టుకుని టీడీపీ హడావిడి చేసింది. నారా లోకేష్ ఏ స్థాయిలో రంకెలు వేశారో అందరికీ తెలుసు. ఇక ఎన్నికల వేళ డీజీపీ సహా పలువురు ఎస్పీలు, ఇతర అధికారుల్ని టార్గెట్ చేసి మరీ ప్రతిపక్షం బదిలీ చేయించింది. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. పోలీసుల్ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. శాంతి భద్రతల అమలులో పక్షపాతం చూపిస్తున్నారని అన్నారు. పోలింగ్ రోజు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ హాట్ కామెంట్లు చేశారు. తాజాగా అంబటి రాంబాబు ఓ ఘాటు ట్వీట్ వేశారు. కూటమిలో నాలుగో పార్ట్ నర్ గా ఏపీ పోలీసులు చేరారని అన్నారాయన.

ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా ఏపీలో కొన్నిచోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఇరు వర్గాలు తీవ్ర ఘర్షణలకు దిగాయి. ఈ ఘర్షణల్లో వైసీపీ ఎక్కువగా నష్టపోయిందని తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు పోలీసుల్ని టార్గెట్ చేశారు. అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలీసు విభాగంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్నికల కమిషన్ సాక్షాత్తూ డీజీపీపై బదిలీ వేటు వేయడంతో పోలీస్ విభాాగంలో కూడా అలజడి చెలరేగింది. దీంతో సహజంగానే టీడీపీ చేస్తున్న ఆగడాలపై వారు చర్యలు తీసుకోవడం ఆపేశారు. దీంతో అనుకోకుండా వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. టీడీపీతోపాటు కూటమిలో బీజేపీ, జనసేన ఉన్నాయి. ఆ కూటమిలో నాలుగో పార్ట్ నర్ గా ఏపీ పోలీస్ విభాగం కూడా చేరిందని విమర్శించారు అంబటి రాంబాబు. అలా ఆ నలుగురు కలసి ఫైట్ చేసినా ఇటువైపు ఉన్న జగనన్నదే విజయం అని తేల్చారు. 

Tags:    
Advertisement

Similar News