తిరుమలలో ముద్దు ముచ్చట.. వివాదంలో ఆదిపురుష్

వీడ్కోలు సమయంలో ఇలాంటివన్నీ సహజమే అయినా తిరుమల ఆలయం ముందు ఈ సన్నివేశం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. అక్కడే ఉన్న భక్తులు ఇదేంపని అంటూ గుసగుసలాడుకున్నారు.

Advertisement
Update:2023-06-07 09:01 IST

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో జరిగింది. ఫంక్షన్ కి ముందు హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్.. తిరుమలకు వచ్చారు. అయితే దర్శనం తర్వాత ఆలయం ముందు ఒకరికొకరు సెండాఫ్ ఇచ్చుకునే క్రమంలో కౌగిలించుకోవడం ముద్దుపెట్టుకోవడం సంచలనంగా మారింది. తిరుమల ఆలయం ముందు ఏంటీపని అంటూ అప్పుడ్ ట్రోలింగ్ మొదలైంది.



 

ఈరోజు ఉదయం అర్చన సేవలో ఆదిపురుష్ టీమ్ పాల్గొంది. దర్శకుడు, హీరోయిన్.. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చారు. అప్పటికే హీరోయిన్ కి ఫ్లైట్ టైమ్ అవుతోంది. దీంతో ఆమె హడావిడిగా అక్కడినుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఆమెకు సెండాఫ్ ఇచ్చారు దర్శకుడు ఓంరౌత్. ఈ క్రమంలో ఆమెను కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు, వీడ్కోలు పలికారు. వీడ్కోలు సమయంలో ఇలాంటివన్నీ సహజమే అయినా తిరుమల ఆలయం ముందు ఈ సన్నివేశం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. అక్కడే ఉన్న భక్తులు ఇదేంపని అంటూ గుసగుసలాడుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.

బీజేపీ రీయాక్షన్ ఏంటి..?

ఇలాంటి పనులు ఇంకెక్కడైనా, ఎవరైనా చేస్తే బీజేపీ నాయకులు వెంటనే సీన్ లోకి వస్తారు. కానీ ఇక్కడ శ్రీరాముడిపై సినిమా తీసిన డైరెక్టర్, సీత పాత్రలో నటించిన హీరోయిన్. ఒకరకంగా ఈ సినిమాని బీజేపీ ఇప్పటికే బాగా ఓన్ చేసుకుంది. ఇప్పుడీ వివాదంపై ఎలా స్పందించాలో కూడా బీజేపీ నేతలకు అర్థం కావడంలేదు. అందుకే సైలెంట్ గా ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News