లోకేష్ కి భద్రత పెంపు.. ఎల్లో మీడియా అల్ప సంతోషం

లోకేష్ కి ఇకనుంచి సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పిస్తుంది. 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో ఆయన చుట్టూ ఉంటారు.

Advertisement
Update:2024-03-31 06:45 IST

సాధించాం, సాధించేశాం, లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత వచ్చేసింది, ఇక ఆయన ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిపోవడమే తరువాయి అన్నట్టుగా ఎల్లో మీడియా కథనాలిస్తోంది. భద్రత పెంపుతో లోకేష్ క్రేజ్ ఏదో పెరిగినట్టు వార్తలు రాస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదో ఒక మేజిక్ జరగకపోతే ఎలా..? అలాంటి విషయమే ఇది. దీనికే తెగ ఇదైపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

ఎందుకీ అదనపు భద్రత..?

2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత మంత్రిగా లోకేష్ కి ఉండే భద్రత సహజంగానే తగ్గిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి, కేవలం ఎమ్మెల్సీగానే ఆయన మిగిలారు. దీన్ని వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది టీడీపీ. లోకేష్ భద్రతను తగ్గించారని, సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్‌ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టారని, కేవలం వై కేటగిరీ భద్రత మాత్రమే ఇచ్చారని కూడా అన్నారు. లోకేష్ కి తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌, హోంశాఖలకు లేఖలు రాయగా.. ఇన్నాళ్లకు పొత్తు ఫలించింది కాబట్టి, లోకేష్ కి భద్రత పెరిగింది.

లోకేష్ కి ఇకనుంచి సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పిస్తుంది. 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో నలుగురైదుగురు NSG కమాండోలు ఉంటారు. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్రం భద్రతను పెంచినట్టు ఎల్లో మీడియా కథనాల సారాంశం. 

Tags:    
Advertisement

Similar News