అదానీ దేశం, జగన్ రాష్ట్రం పరువు తీశారు
జగన్కు గౌతమ్ అదానీ రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్న షర్మిల
Advertisement
ఏపీ మాజీ సీఎం జగన్కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ, మరికొందరిపై అభియోగాలు చేశాయి. భారత్లో అదానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడైంది. ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్లు ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయి. గౌతమ్ అదానీపై విచారణ జరిపితే ఈ విషయం బైటికి వచ్చింది. అమెరికా ఏజెన్సీలు బయటపెట్టే వరకు ఇది బైటికి రాలేదని షర్మిల తెలిపారు.
Advertisement