పాపం పండే రోజు వచ్చింది.. అందుకే ఈ విపరీతాలు - పృథ్వీరాజ్‌

తనపై వేటు వేసిన సమయంలో ఏదో ఉగ్రవాదిపై దర్యాప్తు చేసినట్టుగా చేశారన్నారు. మరి ఇంత దరిద్రంగా ఒక ఎంపీ చేస్తే ఇంకా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-08-05 07:22 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ బలపడుతోంది. ఎంపీ అయి ఉండి న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఒక మహిళతో శృంగారభరిత సంభాషణ జరిపి ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి పోగొట్టుకున్న నటుడు పృథ్వీరాజ్.. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తనపై వేటు వేసిన సమయంలో ఏదో ఉగ్రవాదిపై దర్యాప్తు చేసినట్టుగా చేశారన్నారు. మరి ఇంత దరిద్రంగా ఒక ఎంపీ చేస్తే ఇంకా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. గంట, అరగంట అంటూ మహిళలతో మాట్లాడిన వారికి ప్రమోషన్లు ఇచ్చారని పృథ్వీ విమర్శించారు. అంబటి రాంబాబు ఏకంగా ఫోన్లోనే వచ్చి ఏమేమి చేస్తారంటూ మహిళతో మాట్లాడారని వివరించారు.

పార్లమెంట్‌ చరిత్రలోనే ఇంతటి దరిద్రమైన ఉదంతం మరొకటి ఉండదన్నారు. ఇప్పుడు జగన్‌ మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారా అన్న దానిపై దేశం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. నిజాయితీ ఉంటే వెంటనే గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మిన వారిని నట్టేట ముంచిన వైసీపీకి పాపం పండే రోజు దగ్గర పడిందని.. అందుకే ఈ విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News