విశాఖలో జీబీఎస్‌ వ్యాధితో మహిళ మృతి

కేజీహెచ్‌లో వైద్య సేవల కోసం ఆస్పత్రిలో చేరిన మలేవీడు గ్రామానికి చెందిన రేణుక మహంతి

Advertisement
Update:2025-02-17 16:11 IST

విశాఖపట్నంలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కేజీహెచ్‌సీలో వైద్య సేవల కోసం గురువారం ఎల్‌ కోట మండలం మలేవీడు గ్రామానికి చెందిన రేణకు మహంతి ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో డాక్టర్లు చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే కేజీహెచ్‌లో జీబీఎస్‌తో ఎలాంటి మరణం సంభవించలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. జీబీఎస్‌ అంటువ్యాధి కాదన్నారు. గులియన్‌ బారీ సిండ్రోమ్‌కే కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివవరకు 5 సస్పెక్ట్ కేసులు వచ్చాయని, అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపామన్నారు.  

Tags:    
Advertisement

Similar News