జగన్‌ భారీ స్కెచ్‌.. 11 స్థానాల్లో ఇన్‌చార్జుల ప్రకటన..!

పలు చోట్ల సిట్టింగ్‌లను మార్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2023-12-11 21:32 IST

2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ రెడీ అవుతోంది. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉండటంతో పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ కూడా ఏపీపై పడింది. దీంతో పలు చోట్ల సిట్టింగ్‌లను మార్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో 11 చోట్ల పార్టీ ఇన్‌చార్జులను మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. పలువురు సిట్టింగ్‌లకు స్థానచలనం కల్పించారు. ఈ ఇన్‌చార్జులే రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

11 నియోజకవర్గాల ఇన్‌చార్జులు వీరే-

ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్‌

కొండెపి - ఆదిమూలపు సురేష్‌

వేమూరు - వరికూటి అశోక్‌ బాబు

తాడికొండ - మేకతోటి సుచరిత

సంతనూతలపాడు - మేరుగ నాగార్జున

గుంటూరు పశ్చిమ - విడుదల రజిని

చిలకలూరిపేట - మల్లెల రాజేష్‌ నాయుడు

అద్దంకి - పాణెం హనిమి రెడ్డి

మంగళగిరి - గంజి చిరంజీవి

రేపల్లె - ఈవూరు గణేష్‌

గాజువాక - వరికూటి రామచంద్రరావు 

Tags:    
Advertisement

Similar News