గేదెలను ఢీకొట్టి ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో బోల్తాపడింది.

Advertisement
Update: 2024-07-22 02:51 GMT

తీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గేదెలను ఢీకొట్టిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన శ్రీవెంకట కనకదుర్గ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రయాణికులతో అనంతపురానికి శనివారం రాత్రి బయలుదేరింది. మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్‌ సాయంతో బస్సును బయటికి తీశారు.

బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన గజ్జల శివయ్య (42) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కొర్ర విజయలక్ష్మి బాయ్‌ (50) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. స్వల్పంగా గాయపడ్డ మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News