ఏపీ బడ్జెట్‌ రూ. 2.94 లక్షల కోట్లు

శాసనసభలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌

Advertisement
Update:2024-11-11 10:46 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ఈభేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. శానన మండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ణు మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ అంచనా రూ. 2.34 కోట్లు, మూల ధనం వ్యయం అంచనా 32,712 కోట్లు, ద్రవ్యలోటు 68,743 కోట్లుగా ఉన్నది.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా

ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు, ఆరోగ్య రంగం రూ. 18,421 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు, పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు, గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు, జల వనరులు రూ. 16,705 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ. 3,127 కోట్లు. ఇంధన రంగం రూ. 8,207 కోట్లు. రోడ్లు, భవనాలు రూ. 9,554 కోట్లు. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 322 కోట్లు. పోలీస్‌ శాఖ రూ. 8.495 కోట్లు కేటాయించారు. 

సంక్షేమానికి కేటాయింపులు ఇలా

ఏపీలో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ సంక్షేమానికి రూ. 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ. 7,557 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 39,007 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 4,376 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ. 4,285 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ. 1,215 కోట్లు కేటాయించారు.

Tags:    
Advertisement

Similar News