తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. గ్రేటర్‌లో ఆరెంజ్ అలెర్ట్..

ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. వర్షపు నీటితో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. సోమాజిగూడ, జూబ్లీహిల్స్.. ప్రాంతాల్లో అనేక‌చోట్ల చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. అత్యథికంగా ఖైరతాబాద్ ప్రాంతంలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి హఫీజ్‌ పేట, మాదాపూర్, రాజేంద్రనగర్ లో కూడా భారీగా వర్షం కురిసింది. మరో రెండు రోజులపాటు గ్రేటర్ […]

Advertisement
Update:2022-07-10 03:16 IST

ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. వర్షపు నీటితో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. సోమాజిగూడ, జూబ్లీహిల్స్.. ప్రాంతాల్లో అనేక‌చోట్ల చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. అత్యథికంగా ఖైరతాబాద్ ప్రాంతంలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి హఫీజ్‌ పేట, మాదాపూర్, రాజేంద్రనగర్ లో కూడా భారీగా వర్షం కురిసింది. మరో రెండు రోజులపాటు గ్రేటర్ పరిధిలో వాతావరణం ఇలాగే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. గ్రేటర్‌ కు ఆరెంజ్‌ అలెర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు.

నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలో అత్యథికంగా 10.56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 24 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు కొట్టుకుపోయాయి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాలు దారిమళ్లించారు. విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలబడటంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

జలదిగ్బంధంలో గ్రామాలు..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు గ్రామాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ఆర్మూర్‌ పట్టణంలో పలు కాలనీలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ పలు కాలనీల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల్లో వరి, సోయాబీన్‌ పంటలు నీట మునిగాయి. నిజామాబాద్‌ లో 63 చెరువులు, కామారెడ్డిలో 62 చెరువులు అలుగులు దాటి పొంగిపొర్లాయి. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని లింగి తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో గల్లంతయ్యారు.

ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్..

మరో రెండురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది, సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ని సిద్ధం చేసింది.

Tags:    
Advertisement

Similar News