రాష్ట్రపతి రబ్బర్ స్టాంపే ! రాజ్యాంగ రక్షణ కల్లే ! యశ్వంత్ సిన్హా

రాష్ట్రపతి ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాలో అసహనం పెరిగిపోతోంది. రాష్ట్రపతిని ఆయన అప్పుడే రబ్బర్ స్టాంప్ గా అభివర్ణించేశారు. ఇలా స్టాంప్ గా ఉండే వ్యక్తి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఎప్పుడూ ప్రయత్నించరని అన్నారు. దేశంలో ఇప్పుడు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు ముప్పునెదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోరేందుకు ఆయన ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు, […]

Advertisement
Update:2022-07-09 05:16 IST

రాష్ట్రపతి ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాలో అసహనం పెరిగిపోతోంది. రాష్ట్రపతిని ఆయన అప్పుడే రబ్బర్ స్టాంప్ గా అభివర్ణించేశారు. ఇలా స్టాంప్ గా ఉండే వ్యక్తి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఎప్పుడూ ప్రయత్నించరని అన్నారు.

దేశంలో ఇప్పుడు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు ముప్పునెదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోరేందుకు ఆయన ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు, తనకు మధ్య పోటీ ఉన్నా.. తదుపరి రాష్ట్రపతి ఎవరన్నది ముఖ్యం కాదని ఆయన చెప్పారు.

పోరాటం ఇప్పుడు పెద్దదిగా మారిందని, రాష్ట్రపతిగా ఎన్నికయిన తరువాత ఆ వ్యక్తి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తన హక్కులను వినియోగించుకుంటారా అన్నదే ముఖ్యమని సిన్హా చెప్పారు. చెప్పొచ్చేదేమిటంటే రబ్బర్ స్టాంప్ అయ్యాక ఇక ఇది జరుగుతుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.

ఈ రోజుల్లో ప్రెస్ తో సహా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక సంస్థలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు 1975-1977 మధ్యకాలంలో ఎల్.కె. అద్వానీ, వాజ్ పేయి ఎమర్జెన్సీపై పోరాటం చేసి జైలుకు కూడా వెళ్లారు.

నేడు వారి సొంత పార్టీయే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది అని బీజేపీని ఉద్దేశించి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ఇది చాలా విచారకరమన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన ఆయన.. సస్పెండయిన బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించిన ఇద్దరు హత్యకు గురయ్యారని, పైగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ అనేకచోట్ల నిరసనలు పెల్లుబికాయని పేర్కొన్నారు.

తనతో బాటు చాలామంది రెండు హత్యలను ఖండించారని, కానీ ప్రధాని గానీ, హోం మంత్రిగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని సిన్హా దుయ్యబట్టారు. అంటే ఓట్లు రాబట్టేందుకు ఈ విధమైనవాటిని సజీవంగా ఉంచాలనే వారు భావిస్తున్నట్టు కనబడుతోందన్నారు.

గిరిజన మహిళ రాష్ట్రపతి అయినంత మాత్రాన….

ఒక గిరిజన మహిళ (ద్రౌపది ముర్ము) రాష్ట్రపతి అయినంత మాత్రాన దేశంలోని గిరిజనుల జీవితాలను మార్చజాలరని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ఒకరు ఏ కులం లేదా మతం నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎవరు ఏ ఐడియాలజీకి కట్టుబడి ఉంటారన్నది ప్రధానమని ఆయన చెప్పారు.

ఝార్ఖండ్ గవర్నర్ గా ఆమె (ముర్ము) ఆరేళ్ళు వ్యవహరించినా అక్కడి గిరిజనుల జీవితాలు మారలేదని సిన్హా పెదవి విరిచారు. నిజానికి ఈ ఎన్నిక అన్నది రెండు సిధ్ధాంతాల మధ్య జరిగే పోటీ అని నేనెప్పుడో వ్యాఖ్యానించా అన్నారాయన. ఉదయపూర్, అమరావతి వంటి ఘటనలను చూస్తే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే ఇవి జరిగాయని అనిపిస్తోందని, ఓట్లను పొందడానికి బీజేపీ వీటిని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇలాంటి యత్నాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News