ముద్దుల మామయ్య.. ఎక్కడికెళ్లావయ్యా..?

రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మామయ్యనని.. ముద్దులు పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారని, ఇప్పుడా ముద్దుల మామయ్య ఎక్కడికెళ్లిపోయారని సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన-జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముద్దుల మామయ్య ఫీజు చెల్లించకపోవడంతో.. పేద విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారని విమర్శించారు. జగన్ కుమార్తె మాత్రం విదేశాల్లో చదువుకుంటోందని, సీఎం కుమార్తె గురించి మాట్లాడటానికి తనకు సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా జరగడంలేదని చెప్పారు […]

Advertisement
Update:2022-07-03 14:05 IST

రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మామయ్యనని.. ముద్దులు పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారని, ఇప్పుడా ముద్దుల మామయ్య ఎక్కడికెళ్లిపోయారని సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన-జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముద్దుల మామయ్య ఫీజు చెల్లించకపోవడంతో.. పేద విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారని విమర్శించారు.

జగన్ కుమార్తె మాత్రం విదేశాల్లో చదువుకుంటోందని, సీఎం కుమార్తె గురించి మాట్లాడటానికి తనకు సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా జరగడంలేదని చెప్పారు పవన్.

విజయవాడలో జరిగిన జనసేన-జనవాణి కార్యక్రమంలో మొత్తం 427 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ, గృహ నిర్మాణం, మున్సిపల్, వ్యవసాయ, మంచి నీటి సమస్యలకు చెందిన ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి.

జగన్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, కనీసం వారి ఫిర్యాదులను తీసుకోవడం లేదని.. అందుకే జనసేన ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు పవన్.

ముఖ్యమంత్రి కాక ముందు జనంలోకి వెళ్లిన జగన్.. సీఎం అయిన తర్వాత జిల్లా పర్యటనల్లో జనంతో కలవడానికి ఇష్టపడటంలేదని.. ప్రజలు తనను కలవనీయకుండా బారికేడ్లు, తెరలు పెట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మాట ఇస్తే మడమ తిప్పననే వాళ్లు ఇప్పుడు విదేశాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు పవన్. రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదని, సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, కేవలం వాలంటీర్లు సంతకం పెట్టని కారణంగా.. పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అస్తవ్యస్తంగా ఉందని, జనవాణిలో వచ్చిన ఫిర్యాదులే దీనికి నిదర్శనం అని అన్నారు. ఏపీలో ప్రశ్నించడానికి గొంతెత్తితే చాలు ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు పవన్ కల్యాణ్.

Tags:    
Advertisement

Similar News