ఉప‌రాష్ట‌ప‌తి ఎన్డీయే అభ్య‌ర్ధిగా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్?

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప‌లువురి పేర్లు వినిపివ‌స్తుండ‌గా తాజాగా మ‌రో కొత్త పేరు తెర‌మీదికి వ‌చ్చింది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన‌భై ఏళ్ల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి వెన్ను శస్త్రచికిత్స కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయ‌న తిరిగి రాగానే తన పార్టీ పంజాబ్ లోక్ […]

Advertisement
Update:2022-07-02 11:40 IST

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప‌లువురి పేర్లు వినిపివ‌స్తుండ‌గా తాజాగా మ‌రో కొత్త పేరు తెర‌మీదికి వ‌చ్చింది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన‌భై ఏళ్ల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి వెన్ను శస్త్రచికిత్స కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయ‌న తిరిగి రాగానే తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది. పార్టీ నుండి ఎటువంటి సమాచారం లేనప్పటికీ, దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ సీనియర్ బిజెపి నాయకుడు హర్జీ సింగ్ గ్రేవాల్ శనివారం ప్రకటించారు.

లండన్‌కు బయలుదేరే ముందు, అమ‌రీంద‌ర్ సింగ్ త‌న‌ పార్టీని బిజెపిలో విలీనం చేయాలనే ఉద్దేశ్యాన్ని తెలియజేశారని, ఆయ‌న తిరిగి వచ్చిన తర్వాత విలీనాన్ని ప్రకటిస్తారని గ్రేవాల్ చెప్పారు. కెప్టెన్ అమ‌రీంద‌ర్ పాటియాలా రాజకుటుంబానికి చెందినవాడు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సింగ్, గత సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు, మాజీ క్రికెట‌ర్ సిద్ధూతో పొస‌గ‌క పోవ‌డంతో ముఖ్యమంత్రిగా నిష్క్రమించాల్సి వ‌చ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు.

ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి, సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్)తో పొత్తుతో పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌హా పార్టీ ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌హా పార్టీ అభ్య‌ర్ధులు మొత్తం ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు.

ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కానీ మ‌రో మైనారిటీ నేత గానీ ఎన్డీయే త‌ర‌పున అభ్య‌ర్ధిగా ఉండొచ్చ‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. ఇంత‌లోనే కెప్టెన్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. నామినేషన్ పత్రాల దాఖలుకు జూలై 19 చివరి రోజు కాగా, ఈ కీలక రాజ్యాంగ పదవికి ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    
Advertisement

Similar News