ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి పూర్తిగా మట్టితోనే..

ఖైరతాబాద్ అనగానే అందరికీ భారీ వినాయకుడి విగ్రహమే గుర్తుకువస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పేరు ఉంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తుతారు. 68 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినాయక విగ్రహాం ప్రతీ ఏడాది ఒక అడుగు పెంచుతూ పోవడంతో 2014లో 60 అడుగులకు చేరుకుంది. మొదట్లో మట్టితోనే చేసినా.. కాలక్రమంలో భారీ విగ్రహా నిర్మాణంలో భారీగా స్టీల్, ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌ను ఉపయోగిస్తూ వచ్చారు. కాగా, పర్యవరణ కార్యకర్తలు, […]

Advertisement
Update:2022-06-27 13:28 IST

ఖైరతాబాద్ అనగానే అందరికీ భారీ వినాయకుడి విగ్రహమే గుర్తుకువస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పేరు ఉంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తుతారు. 68 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినాయక విగ్రహాం ప్రతీ ఏడాది ఒక అడుగు పెంచుతూ పోవడంతో 2014లో 60 అడుగులకు చేరుకుంది.

మొదట్లో మట్టితోనే చేసినా.. కాలక్రమంలో భారీ విగ్రహా నిర్మాణంలో భారీగా స్టీల్, ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌ను ఉపయోగిస్తూ వచ్చారు. కాగా, పర్యవరణ కార్యకర్తలు, సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో విగ్రహం సైజును తగ్గించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా, 2019లో భక్తుల కోరికపై ఖైరతాబాద్ విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇందుకోసం ఏకంగా రూ. 1 కోటి ఖర్చు చేశారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2020లో కేవలం 9 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. గతేడాది 40 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేశారు. అయితే ఈసారి మాత్రం 50 అడుగుల విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.

చాలా ఏళ్ల తర్వాత ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు సోమవారం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నమూనాను కూడా విడుదల చేశారు. తొలిసారిగా ఖైరతాబాద్‌లో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మట్టి గణపతులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వానికి మద్దతుగానే తాము మట్టి విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించినట్లు నిర్వాహక కమిటీ తెలిపింది.

పంచముఖ లక్ష్మీ గణపతిరూపంలో ఈ సారి వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రి, కుడిపైపు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఉంచుతారు. ఈ మూడు విగ్రహాలు ఒకేసారి నిమజ్జనానికి తరలి వెళ్లనున్నట్లు వారు చెప్పారు. అగస్టు 31 గణేష్ చతుర్థి నాడు ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.

Tags:    
Advertisement

Similar News