14 ఏళ్ల‌లో 60 సంస్థ‌ల‌ను మూసేసిన ఘ‌నుడు చంద్ర‌బాబు

ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో.. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన అభినవ పులకేశి బాబు అని విమ‌ర్శించారాయన. వైసీపీ హయాంలో మూడేళ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు విజయసాయి. వైసీపీ జాబ్ మేళాలకు విశేష స్పందన.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ […]

Advertisement
Update:2022-06-25 06:36 IST

ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో.. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన అభినవ పులకేశి బాబు అని విమ‌ర్శించారాయన. వైసీపీ హయాంలో మూడేళ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు విజయసాయి.

వైసీపీ జాబ్ మేళాలకు విశేష స్పందన..
ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జాబ్ మేళాలకు విశేష స్పందన వస్తోందని చెప్పారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌ జిల్లా చాపాడు సమీపంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా వివరాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

120 ప్రముఖ కంపెనీలలో 10వేల ఉద్యోగాలు కల్పించేందుకు శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వం ద్వారా లక్షలాదిమందిని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, పార్టీ ద్వారా వేలాదిమందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారాయన.

వైసీపీ ఇప్పటివరకు నిర్వహించిన మూడు జాబ్ మేళాల్లో 40 వేల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని నిరుద్యోగులందరూ సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే జాబ్‌ మేళా ను వినియోగించుకోవాలని, ఎంపిక కాలేని వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు విజయసాయిరెడ్డి.

పప్పుతిని పడుకునేవాళ్లు కూడా..
ఇంత చేస్తున్నా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయటం హాస్యాస్పదం అన్నారు విజయసాయిరెడ్డి. ఎమ్మెల్యేగా గెలవలేని, పప్పుతిని పడుకునే వ్యక్తి సవాళ్లు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సమ్మతించటం గొప్ప విషయమన్నారు విజయసాయిరెడ్డి. ఒక ఆదివాసి మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తుంటే హర్షించలేని కుటిల స్వభావం చంద్రబాబుదంటూ ఎద్దేవా చేశారు.

“ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పానని, చాలా మందిని రాష్ట్రపతులు- ప్రధానులుగా చేశానని చెప్పుకుంటాడు. పాలకపక్షం సరే – కనీసం ప్రతిపక్షం కూడా ఆ డర్టీయెస్ట్ పొలిటీషియన్ వైపు చూడటం లేదు. ‘ఔట్’ డేటెడ్’ అని చెప్పడానికి ఇంకేమి కావాలి బాబు?” అంటూ ట్విట్టర్లో కూడా బాబుపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News