త్వరలో 20 మంది టీడీపీ నేతలపై సీబీఐ, ఈడీ దాడులు?

ఏపీలో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు తప్పవని వార్తలు వస్తున్నాయి. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేయబోతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాలు ప్రారంభం మాత్రమేనని ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. “20 మంది టీడీపీ నేతల జాబితా సిద్ధంగా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]

Advertisement
Update:2022-06-23 10:15 IST

ఏపీలో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు తప్పవని వార్తలు వస్తున్నాయి. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేయబోతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాలు ప్రారంభం మాత్రమేనని ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి.

“20 మంది టీడీపీ నేతల జాబితా సిద్ధంగా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు త్వరలో వారి నివాసాలు, కార్యాలయాలపై దాడి చేయబోతున్నారు” అని కొన్ని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు, నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల ముందు ఇలా దాడులు జరగడం వల్ల టీడీపీ ఉక్కిరిబిక్కిరి కానుంది. పార్టీ ఆర్థిక మూలాలు తెగిపోతే, పార్టీ కోలుకోవడం కష్టమే అని రాజకీయ‌ వర్గాలు పేర్కొన్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మురళీమోహన్, బీద రవిచంద్ర, పోతుల రామారావు వంటి పలువురు టీడీపీ నేతలపై ఈడీ వరుస దాడులు చేసింది. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్ర ప్రభావం పడింది.

ఈసారి మళ్ళీ 20 మంది టీడీపీ నేతల ఇళ్ళపై సీబీఐ, ఈడీలు దాడులు చేస్తే ఆ సంక్షోభం నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి

Tags:    
Advertisement

Similar News