ఇండియాలో బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇవే..

ప్రయాణాల్లో రోడ్డు ప్రయాణాలు ఎంతో ప్రత్యేకం. రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌ చేస్తూ.. ముందుకి సాగిపోతుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. రోడ్ ట్రిప్స్‌ ను ఇష్టపడేవారి కోసం ఇండియాలో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి.

Advertisement
Update:2023-04-15 07:23 IST

Best road trips in India: ఇండియాలో బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇవే..

ప్రయాణాల్లో రోడ్డు ప్రయాణాలు ఎంతో ప్రత్యేకం. రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌ చేస్తూ.. ముందుకి సాగిపోతుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. రోడ్ ట్రిప్స్‌ ను ఇష్టపడేవారి కోసం ఇండియాలో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..

పర్వతాల నుంచి పచ్చని కొండల వరకూ, మంచు లోయల నుంచి ఎడారి వరకూ ఇండియాలో రకరకాల రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో తప్పక ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనాలి టు లేహ్

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుంచి లధాఖ్‌లోని లేహ్ వరకూ.. హిమాలయ పర్వతాలు, లోయల గుండా సాగే రోడ్డు జర్నీని ఇండియాలోనే బెస్ట్ రోడ్ ట్రిప్‌గా చెప్పొచ్చు. ఈ ట్రిప్ కోసం ఇతరదేశాల నుంచి కూడా బైకర్లు వస్తుంటారు.

జైసల్మేర్ టు బికానెర్

కనుచూపుమేర ఖాళీగా కనిపించే ఏడారి మధ్యలో తిన్నగా ఉండే రోడ్డుపై జర్నీ చేస్తుంటే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎడారి ప్రాంతాలను ఇష్టపడేవాళ్లు ఈ రోడ్ ట్రిప్ కచ్చితంగా వెళ్లి తీరాలి.

గోవా టు ముంబయి

హైవేపై లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడేవారికి గోవా నుంచి ముంబయి రూట్ సరిగ్గా సరిపోతుంది. లాంగ్ కార్ డ్రైవ్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్.

బెంగళూరు టు కూర్గ్

కర్నాటకలోని బెంగళూరు నుంచి కూర్గ్ వరకూ ఉండే రోడ్డు వెస్టర్న్ ఘాట్స్ గుండా వెళ్తుంది. అడవులు, పచ్చని కొండల మధ్యలో జర్నీని ఇష్టపడే వారికి ఈ రూట్ బెస్ట్ ఆప్షన్.

సోన్‌మార్గ్ టు గుల్మార్గ్

కశ్మీర్ అందాలను వీక్షిస్తూ.. మంచు కురిసే రోడ్లపై ప్రయాణించాలనుకుంటే సోన్‌మార్గ్ నుంచి గుల్మార్గ్ రూట్‌ను ఎంచుకోవాలి. ఈ రోడ్డు ఎంతో అందంగా మంచుతో కప్పబడిన చెట్ల మధ్య నుంచి సాగుతుంది.

వైజాగ్ టు అరకు

హైదరాబాద్‌కు దగ్గర్లో మంచి రోడ్ ట్రిప్ వేయాలనుకుంటే వైజాగ్ నుంచి అరకు రూట్‌ను ఎంచుకోవచ్చు. అరకులోయలను వీక్షిస్తూ.. ఘాట్ రోడ్ గుండా సాగే జర్నీ ఎంతో బాగుంటుంది.

చెన్నై టు పాండిచ్చేరి

బీచ్ వెంట లాంగ్ డ్రైవ్ చేయాలనుకునేవారు చెన్నై టు పాండిచ్చేరి రూట్‌ను ఎంచుకోవచ్చు. విశాలమైన హైవేపై, బీచ్ వెంట సాగే ఈ రోడ్ ట్రిప్ ఎంతో స్పెషల్‌గా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News