ఆలేరు కాంగ్రెస్‌లో ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు బహిర్హతమయ్యాయి. ఈ సెగ్మెంట్‌లో మండలానికో నాయకుడు తయారయ్యారు. అందరూ ఎమ్మెల్యే క్యాండిడెట్లు అని చెప్పుకుంటున్నారు. దాంతో ఎవరూ ఎవరినీ లెక్క చేయడం లేదు. ఒక్కో నాయకుడు ఒక్కో పెద్దనాయకుడిని పట్టుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ మాదే అని చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగడం లేదు. ఫ్రస్టేష్టన్‌ను పోటీదారులపై చూపిస్తున్నారు. తాజాగా భువనగిరిలో ఆలేరు నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ యాదవ్ […]
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో మరోసారి విబేధాలు బహిర్హతమయ్యాయి. ఈ సెగ్మెంట్‌లో మండలానికో నాయకుడు తయారయ్యారు. అందరూ ఎమ్మెల్యే క్యాండిడెట్లు అని చెప్పుకుంటున్నారు. దాంతో ఎవరూ ఎవరినీ లెక్క చేయడం లేదు. ఒక్కో నాయకుడు ఒక్కో పెద్దనాయకుడిని పట్టుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ మాదే అని చెప్పుకుంటున్నారు.
అంతటితో ఆగడం లేదు. ఫ్రస్టేష్టన్‌ను పోటీదారులపై చూపిస్తున్నారు. తాజాగా భువనగిరిలో ఆలేరు నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ యాదవ్ ముందే ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు దూషణలకు దిగారు.
కార్యకర్తలు కూడా రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు తెగబడ్డారు. సమావేశంలో తొలుత… ఆలేరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీర్ల అయిలయ్యపై మాజీ ఎమ్మెల్యే నగేష్ పలు విమర్శలు చేశారు. బీర్ల అయిలయ్యతో పాటు ఆయన వెంట ఉన్న వారంతా ఫెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ మాట్లాడారు. దాంతో అయిలయ్యకు, ఆయన అనుచరులకు కోపం వచ్చింది.
ఒకరి వీక్‌నెస్‌లు మరొకరు చెప్పుకుంటూ వాగ్వాదానికి దిగారు. రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. నిజానికి అయిలయ్య, నగేష్ మధ్యే కాదు… ఇలా ఒకరంటే ఒకరికి పడని, తామే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పుకునే నాయకులు ఆలేరు కాంగ్రెస్‌లో చాలా మందే ఉన్నారు. తుర్కపల్లికి చెందిన కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరుకు చెందిన జనగాం ఉపేందర్ రెడ్డి, తుర్కపల్లికే చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి, మోటకొండూరు ఎంపీపీ సంజీవరెడ్డి, గుండాలకు చెందిన అండెం సంజీవరెడ్డి ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది.
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బంట్రు శోభారాణి కూడా ఇప్పుడు రేస్‌లోకి వచ్చారు. వీరిలో కొందరు తమకు కోమటిరెడ్డి ఆశీస్సులున్నాయి అంటుంటే మరికొందరు రేవంత్ రెడ్డి తమకు బాగా తెలుసు అని చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే నగేష్‌కు ఎంపీ కోమటిరెడ్డికి మధ్య సరైన సంబంధాలు లేవు. తనకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోనే పరిచయాలున్నాయని ఆయన చెప్పుకుంటున్నారు. తాను ఇది వరకే ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి రేస్‌లో తానే ముందు అంటున్నారాయన.
ఇన్‌చార్జ్ అయిలయ్యకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులున్నాయి. ఆలేరుతో తమ కులస్తులే ఎక్కువ కాబట్టి టికెట్ తనకే అంటున్నారు అయిలయ్య. మాజీ జెడ్పీటీసీ అయోధ్య రెడ్డి .. రేవంత్ రెడ్డి కోర్ టీం మెంబర్ అని చెబుతుంటారు. కాబట్టి తనకు రేవంత్ టికెట్ ఇప్పిస్తారని అయోధ్య రెడ్డి ఆశ.
ఇక బంట్రు శోభారాణి .. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఆమె చేరే విషయం తనకు చెప్పలేదని కోమటిరెడ్డి వర్గం ఆ విషయంలో అసంతృప్తితో ఉంది. ఇలా ఆలేరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ఏడెనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా పనిగట్టుకుని ఓడిస్తారన్న భయం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉంది. ఇంత మంది మగవాళ్ళ మధ్య తమ పార్టీ మధ్య మనుగడ కష్టమే అని వాపోతున్నారు. శనివారం నగేష్, అయిలయ్య మధ్యే గొడవ జరిగిందని… టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఇలాంటి సమావేశమే అందరి నేతలతో కలిపి పెడితే ఎవరు ఎవరి గ్రూపో కూడా కనుక్కోలేని విధంగా కలబడి కొట్టుకోవడం ఖాయమంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులే.