భళారే! బీసీసీఐ పెన్షన్! 900 మందికి నెలకు 30 వేల నుంచి 70 వేలు
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా పేరుపొందిన భారత క్రికెట్ నియంత్రణమండలి స్థాయికి తగ్గట్టుగా పెన్షన్ చెల్లిస్తోంది. పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 900మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర మాజీ సిబ్బందికి నెలవారీ పెన్షన్ చెల్లిస్త్తోన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ప్రకటించారు. గతంలో కంటే నూరుశాతం అధికంగా పెన్షన్ మొత్తాన్ని పెంచినట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. 15వేల నుంచి 30 వేలకు పెరిగిన పెన్షన్.. మాజీ క్రికెటర్లు, […]
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా పేరుపొందిన భారత క్రికెట్ నియంత్రణమండలి స్థాయికి తగ్గట్టుగా పెన్షన్ చెల్లిస్తోంది. పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 900మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు, ఇతర మాజీ సిబ్బందికి నెలవారీ పెన్షన్ చెల్లిస్త్తోన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ప్రకటించారు.
గతంలో కంటే నూరుశాతం అధికంగా పెన్షన్ మొత్తాన్ని పెంచినట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు.
15వేల నుంచి 30 వేలకు పెరిగిన పెన్షన్..
మాజీ క్రికెటర్లు, అంపైర్లు ఆడిన, పాల్గొన్న మ్యాచ్ ల సంఖ్యను బట్టి పెన్షన్ లను ఖరారు చేశారు. ఇప్పటి వరకూ 15వేల రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని 30వేల రూపాయలకు పెంచారు.
భారత క్రికెట్ కు గతంలో అమూల్యసేవలు అందించిన మాజీ క్రికెటర్లు, అంపైర్లు ఎంతో విలువైన వారని, వారిసేవలకు గుర్తింపుగా ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్ ను 100 శాతం పెంచామని, జూన్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని చెల్లిస్తామని బోర్డు కార్యదర్శి జే షా మీడియాకు తెలిపారు.
భారత క్రికెట్ ప్రస్తుత ఈస్థాయిలో ఉండటానికి మాజీ క్రికెటర్లు, అంపైర్లు చేసిన అసాధారణ సేవలేనని కొనియాడారు. వారి బాగోగులు చూసుకోడం, రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సాగేలా చేయటం తమ విధి అని ప్రకటించారు.
50 వేల నుంచి 70 వేలకు…
వందకు పైగా టెస్టుమ్యాచ్ లు ఆడిన కపిల్ దేవ్, వెంగ్ సర్కార్, సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ లాంటి క్రికెటర్లకు గత నెల వరకూ నెలకు 50వేల రూపాయలు పెన్షన్ గా ఇస్తూ వస్తున్నారు. అయితే..ఈ మొత్తాన్ని70వేల రూపాయలకు పెంచారు.
15వేల స్లాబ్ ను 30 వేలకు, 22,500 స్లాబ్ ను 45000కు, 30వేల స్లాబును 52 వేల 500కు, 37 వేల 500 ను 60వేల రూపాయలకు పెంచారు. 50వేల రూపాయల స్లాబును 70వేలకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకొంది.
పురుషుల, మహిళల విభాగాలలోని మొత్తం 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లకు..ఈ ఐదు తరగతులుగా పెన్షన్ చేల్లించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.
ఐపీఎల్ నిర్వహణ ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ తన సంపాదనలో 30 శాతం మొత్తాన్ని క్రికెటర్లకు, మాజీ క్రికెటర్లకు వేతనాలు, కాంట్రాక్టులు, పెన్షన్ ల రూపంలో అందచేస్తూ వస్తోంది.
ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక మొత్తాలు పెన్షన్ గా చెల్లిస్తున్న బోర్డు బీసీసీఐ మాత్రమే.