పీకే సర్వేపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు .. ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందస్తుగానైనా రావొచ్చు, షెడ్యూల్ ప్రకారమైనా రావొచ్చు అందుకు తగ్గట్టే సిద్ధమ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టి 20ఏళ్లు అవుతున్న ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయి ఫలితాలను సాధించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. […]

Advertisement
Update:2022-06-12 02:12 IST

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు .. ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందస్తుగానైనా రావొచ్చు, షెడ్యూల్ ప్రకారమైనా రావొచ్చు అందుకు తగ్గట్టే సిద్ధమ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టి 20ఏళ్లు అవుతున్న ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయి ఫలితాలను సాధించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

సీనియర్ల అవసరం పార్టీకి ఉందని, తుమ్మలను కానీ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని గానీ పార్టీ వదులుకోబోదన్నారు. గత ఎన్నికల తరహాలోనే సిట్టింగులందరికీ టికెట్లు వస్తాయని అనుకోవద్దని.. కొన్ని చోట్ల మార్పులు అనివార్యమన్నారు. 18,19 తేదీల్లో జాతీయపార్టీ ప్రకటనపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు కేటీఆర్‌ హింట్‌ ఇచ్చారు.

ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసిందని.. ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని అందులో తేలిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సత్తా చూపాల్సిన సమయం వచ్చిందన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News