గంటన్నర లోపే సర్వ దర్శనం.. సాధ్యమయ్యే పనేనా..?

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల గరిష్టంగా 48 గంటలు సమయం పట్టిందని భక్తులు కంగారుపడిపోయారు. ముందుగా ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా హడలిపోయారు. అలాంటిది ఇప్పుడు గంటన్నరలోపే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుందని హామీ ఇస్తున్నారు ఈవో ధర్మారెడ్డి. అసలిది సాధ్యమయ్యేపనేనా..? కంపార్ట్ మెంట్లలో గంటలతరబడి వేచి చూడటాన్ని ఎలా నివారిస్తారు..? అసలేంటి టీటీడీ స్ట్రాటజీ..!! శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో దర్శనాలకు అవకాశం లేదు. టోకెన్ల […]

Advertisement
Update:2022-06-09 07:24 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల గరిష్టంగా 48 గంటలు సమయం పట్టిందని భక్తులు కంగారుపడిపోయారు. ముందుగా ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా హడలిపోయారు. అలాంటిది ఇప్పుడు గంటన్నరలోపే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుందని హామీ ఇస్తున్నారు ఈవో ధర్మారెడ్డి. అసలిది సాధ్యమయ్యేపనేనా..? కంపార్ట్ మెంట్లలో గంటలతరబడి వేచి చూడటాన్ని ఎలా నివారిస్తారు..? అసలేంటి టీటీడీ స్ట్రాటజీ..!!

శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో దర్శనాలకు అవకాశం లేదు. టోకెన్ల వ్యవస్థతోపాటు.. సర్వదర్శనానికి కూడా భక్తులకు అనుమతిచ్చిన తర్వాత రద్దీ మరింత పెరిగింది. వేసవి సెలవల కారణంగా ఇటీవల దర్శనానికే 48గంటల సమయం పడుతున్న సందర్భం. అయితే దర్శనాల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్ లోకి వెళ్లిన తర్వాత ఎక్కడా ఆలస్యం లేకుండా గంటన్నర లోపే శ్రీవారి దర్శనం కలిగేల ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి.

బ్రేక్ దర్శనాలకు బ్రేక్..

బ్రేక్ దర్శనాల వల్లే సామాన్యులకు దర్శనం ఆలస్యమవుతోందనే అపవాదు కూడా ఉంది. అందుకే ఇప్పుడు బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం ఆపేశారు అధికారులు. దీంతో ఆ సమయం బాగా కలిసొస్తోంది. ఇటీవల సగటున రోజుకి 70వేలమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గత ఆదివారం ఆ సంఖ్య 90వేలకు చేరుకుంది. అయితే గతంలో లక్షా 20వేలమంది కూడా తిరుమల శ్రీవారిని ఒకేరోజులో దర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో భక్తులు వచ్చినా వేచి చూసే సమయం తక్కువగా ఉండేట్లు చూస్తామంటున్నారు అధికారులు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అదే సాధ్యమైతే.. తిరుమల భక్తులకు అంతకంటే వేరే శుభవార్త ఉండదు.

Tags:    
Advertisement

Similar News