ఈ చిన్నారికి కులం, మతం లేదు

తమిళనాడులో ఒక జంట తమ మూడున్నరేళ్ల కుమార్తెకు ‘కులం లేదు, మతం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందింది.. నరేష్ కార్తీక్, గాయత్రి దంపతులు వారి కుమార్తె విల్మాను కిండర్ గార్టెన్‌లో చేర్చాలనుకున్నారు, అయితే అన్ని పాఠశాలలు కులం,మతం సర్టిఫికేట్ కోసం పట్టుబట్టాయి. కానీ, తమ కుమార్తెకు పాఠశాలల్లో ప్రేమ, సమానత్వం నేర్పాలని భావించామని తల్లిదండ్రులు తెలిపారు. అలాంటి సర్టిఫికెట్ల కోసం పట్టుబట్టని విద్యాసంస్థల కోసం వెతికిన తర్వాత, నరేష్ కార్తీక్ అనేక మంది అధికారులను సంప్రదించి జిల్లా […]

Advertisement
Update:2022-05-31 02:53 IST

తమిళనాడులో ఒక జంట తమ మూడున్నరేళ్ల కుమార్తెకు ‘కులం లేదు, మతం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందింది..

నరేష్ కార్తీక్, గాయత్రి దంపతులు వారి కుమార్తె విల్మాను కిండర్ గార్టెన్‌లో చేర్చాలనుకున్నారు, అయితే అన్ని పాఠశాలలు కులం,మతం సర్టిఫికేట్ కోసం పట్టుబట్టాయి. కానీ, తమ కుమార్తెకు పాఠశాలల్లో ప్రేమ, సమానత్వం నేర్పాలని భావించామని తల్లిదండ్రులు తెలిపారు.

అలాంటి సర్టిఫికెట్ల కోసం పట్టుబట్టని విద్యాసంస్థల కోసం వెతికిన తర్వాత, నరేష్ కార్తీక్ అనేక మంది అధికారులను సంప్రదించి జిల్లా కలెక్టర్ జిఎస్ సమీరన్‌ను కలిశారు. తమ పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవడానికి మతం, కులం తప్పనిసరి కాదని 1973 నాటి తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వును ఉటంకిస్తూ ఉత్తర కోయంబత్తూరు తహశీల్దార్‌ను సంప్రదించాలని ఆ కలెక్టర్ కార్తీక్ కు సూచించాడు.

ఆ తర్వాత దంపతులు తహశీల్దార్‌ను కలిశారు, ‘కులం లేదు, మతం లేదు’ సర్టిఫికేట్ పొందడం ద్వారా తమ బిడ్డకు కుల, మతాల ఆధారంగా పొందే ప్రభుత్వ రిజర్వేషన్లు, ప్రత్యేకతలు పొందేందుకు అర్హత ఉండదని, ఆ మేరకు ఒప్పుదల అఫిడవిట్ ఇవ్వాలని తహశీల్దార్‌ కోరారు. తహశీల్దార్ కోరినట్టు అఫిడవిట్ ఇచ్చిన నరేష్ కార్తీక్, గాయత్రి దంపతులు చివరకు తమ కూతురు విల్మా కు ‘కుల రహిత మత రహిత’ సర్టిఫికేట్ పొందారు. తమ కుమార్తె ఏ కులం లేదా మతానికి చెందినది కాదని అందులో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News