కండక్టర్ గారూ! చిల్లర లేదండీ.. గూగుల్ పే చేస్తా

ఫోన్ పే, గూగుల్ పే.. అన్ని చోట్లా డిజిటల్ చెల్లింపులదే హవా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.. అన్ని అవసరాలకూ ప్లాస్టిక్ కార్డులే దిక్కు. ఆటోవాలాలు కూడా చిల్లర లేదు, ఫోన్ పే చేయండి అని అడిగేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్నా డిజిటల్ మనీతో అన్నీ సర్దుబాటు అయిపోతాయి. అయితే ఆర్టీసీ టికెట్ల వ్యవహారంలో మాత్రం ఇంకా ఈ పద్ధతి అమలులోకి రాలేదు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బస్సుల్లో టికెట్ ఇష్యూయింగ్ […]

Advertisement
Update:2022-05-31 02:57 IST

ఫోన్ పే, గూగుల్ పే.. అన్ని చోట్లా డిజిటల్ చెల్లింపులదే హవా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.. అన్ని అవసరాలకూ ప్లాస్టిక్ కార్డులే దిక్కు. ఆటోవాలాలు కూడా చిల్లర లేదు, ఫోన్ పే చేయండి అని అడిగేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్నా డిజిటల్ మనీతో అన్నీ సర్దుబాటు అయిపోతాయి. అయితే ఆర్టీసీ టికెట్ల వ్యవహారంలో మాత్రం ఇంకా ఈ పద్ధతి అమలులోకి రాలేదు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బస్సుల్లో టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లు (TIM) స్థానంలో ఇకపై మల్టీ పర్పస్ ఈ పోస్ మెషీన్లు ప్రవేశ పెట్టబోతున్నారు. ఇందులో టికెట్ ఇవ్వడంతోపాటు.. డిజిటల్ పేమెంట్లు కూడా చేసుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అంతే కాదు.. ప్రతి ఈ పోస్ మెషీన్ పై గూగుల్ పే, ఫోన్ పే కోసం క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. వీటితో నేరుగా స్కాన్ చేసి టికెట్ డబ్బుల్ని ఆర్టీసీ అకౌంట్ కి పంపించొచ్చు. అంటే ఇకపై టికెట్లు ఇచ్చేటప్పుడు చిల్లర కష్టాలు తప్పిపోతాయన్న‌మాట.

ప్రయోగాత్మకంగా..
ఏపీలో పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను దీనికోసం ఎంపిక చేశారు. ఈ రెండు డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ఈ పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఆయా రూట్లలో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ పోస్ మెషీన్ల వినియోగంపై శిక్షణ కూడా మొదలు పెట్టారు. ఒక్కో డిపో నుంచి పది మంది ఉత్సాహవంతుల్ని ఎంపిక చేసి మూడు వారాల శిక్షణ ఇస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంటే.. వీరికి ఈ పోస్ మెషీన్లు అప్పగించి.. బస్సులు ఎక్కిస్తారు.

యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) సాంకేతికతను ఈపోస్ మెషీన్లలో ప్రవేశ పెడుతున్నారు. దీనికోసం ఇక్సిగో–అభి బస్‌ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఈ పోస్ మెషీన్ల ద్వారా సాధారణ టికెట్లతో పాటు రాయితీపై ప్రయాణం చేసేవారికి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. చిల్లర కష్టాలకు గుడ్ బై చెప్పే ఆల్ ఇన్ వన్ మెషీన్లు ఇకపై ఏపీఎస్ఆర్టీసీలో అందుబాటులోకి రాబోతున్నాయన్న‌మాట.

Tags:    
Advertisement

Similar News