ఖాతాల్లో డబ్బులేస్తున్నాంగా? పనులూ జరగాలంటే ఎలా?

ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన సామాజిక న్యాయభేరి ముగింపు సభలో ప్రసంగించిన ధర్మాన ప్రసాదరావు.. అభివృద్ధి పనులు జరగడం లేదు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలకు గట్టిగా స్పందించారు. ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అవసరాలూ తీర్చాలంటే ఎలా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేయడానికి సమయం పడుతుందని అంతవరకు ఆగాలని ప్రజలకు సూచించారు. ”రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరుగుతున్నాయి. అక్కడక్కడా కొన్ని […]

Advertisement
Update:2022-05-30 02:31 IST

ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన సామాజిక న్యాయభేరి ముగింపు సభలో ప్రసంగించిన ధర్మాన ప్రసాదరావు.. అభివృద్ధి పనులు జరగడం లేదు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలకు గట్టిగా స్పందించారు.

ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అవసరాలూ తీర్చాలంటే ఎలా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేయడానికి సమయం పడుతుందని అంతవరకు ఆగాలని ప్రజలకు సూచించారు.

”రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరుగుతున్నాయి. అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని వ్యాఖ్యలు చేయవద్దు. ఎందుకు జరుగుతాయి?. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉన్నప్పుడు.. ఇతర అవసరాలు తీర్చాలంటే సమయం పడుతుంది. మా ప్రభుత్వ ప్రాధాన్యత బడుగు, బలహీన వర్గాలు. అందుకే కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. బడుగులు గౌరవంగా బతికే స్థాయికి ఎదిగిన తర్వాత.. పనులను వచ్చే కాలంలో చేద్దాం. తొందరేమీ లేదు” అంటూ ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ స్వామి మరోసారి జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్‌ది రామరాజ్యమని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News