రాహుల్ తీన్మార్ రికార్డు 15 మ్యాచ్ ల్లో 661 పరుగులు

ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోరు ఎలిమినేటర్ రౌండ్లోనే ముగిసినా…కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రం ఓ అసాధారణ రికార్డుతో తన ఫ్రాంచైజీకే గర్వకారణంగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తుదివరకూ పోరాడి 14 పరుగుల పరాజయంతో టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది. 208 పరుగుల భారీటార్గెట్ తో […]

Advertisement
Update:2022-05-26 07:56 IST

ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోరు ఎలిమినేటర్ రౌండ్లోనే ముగిసినా…కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రం ఓ అసాధారణ రికార్డుతో తన ఫ్రాంచైజీకే గర్వకారణంగా నిలిచాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తుదివరకూ పోరాడి 14 పరుగుల పరాజయంతో టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది.

208 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన లక్నో తరపున కెప్టెన్ రాహుల్ 79 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఒకేఒక్కడు రాహుల్… ఐపీఎల్ 15 సీజన్ల చరిత్రలో వరుసగా మూడు సీజన్లపాటు 600కు పైగా పరుగులు సాధించిన భారత ఏకైక, ఒకేఒక్క ఆటగాడిగా కెఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సీజన్ లీగ్ లో భాగంగా జరిగిన 14 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లతో పాటు ఎలిమినేటర్ రౌండ్ పోరు వరకూ మూడు సెంచరీలు, 3 అర్థశతకాలతో సహా 661 పరుగులు సాధించాడు.

2020, 2021 సీజన్లలో సైతం 600కు పైగా పరుగుల రికార్డులు సాధించిన రాహుల్ ప్రస్తుత 2022 సీజన్లో సైతం 600కు పైగా పరుగులు సాధించడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

2018 సీజన్లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ గా రాహుల్ 659 పరుగులు, 2020 సీజన్లో 14 మ్యాచ్ ల్లో 670 పరుగులు, 2021 సీజన్లో 13 మ్యాచ్ ల్లో 626 పరుగులు సాధించడం ద్వారా…తన కెరియర్ లో నాలుగుసార్లు 600 పరుగుల అసాధారణ రికార్డు నెలకొల్పగలిగాడు.

గేల్ , వార్నర్ ల సరసన రాహుల్… గతంలో మూడు వేర్వేరు సీజన్లలో 600 పరుగులు సాధించిన ఆటగాళ్లలో కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్, కంగారూ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ ఉన్నారు.
2011, 2012, 2013 సీజన్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ గా క్రిస్ గేల్ 600 పరుగుల రికార్డులు పూర్తి చేయగలిగాడు.

హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ 2016 నుంచి 2019 సీజన్ వరకూ మూడుసార్లు 600కు పైగా పరుగులు సాధించడం విశేషం.

Tags:    
Advertisement

Similar News