సమ్మర్‌ టూర్‌ కోసం చల్లని డెస్టినేషన్స్!

సమ్మర్ సెలవల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకోసం ఎన్నో కూల్ సమ్మర్ డెస్టినేషన్స్ రెడీగా ఉన్నాయి. హాట్ సమ్మర్‌లో కూడా హాయిగా చల్లగాలులు వీచే ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం. సమ్మర్‌లో టూర్ వెళ్లడానికి హిల్ స్టేషన్స్, పర్వత ప్రాంతాలు సరిగ్గా సూట్ అవుతాయి.

Advertisement
Update:2023-04-06 06:56 IST

Summer Vacations in india: సమ్మర్‌ టూర్‌ కోసం చల్లని డెస్టినేషన్స్!

సమ్మర్ సెలవల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకోసం ఎన్నో కూల్ సమ్మర్ డెస్టినేషన్స్ రెడీగా ఉన్నాయి. హాట్ సమ్మర్‌లో కూడా హాయిగా చల్లగాలులు వీచే ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం.

సమ్మర్‌లో టూర్ వెళ్లడానికి హిల్ స్టేషన్స్, పర్వత ప్రాంతాలు సరిగ్గా సూట్ అవుతాయి. అలాంటి కొన్ని బెస్ట్ స్పాట్స్ ఇవే..

మున్నార్

కేరళలోని మున్నార్‌ చాలా పాపులర్ హిల్ స్టేషన్. మున్నార్ అందాలను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. చుట్టూ టీ ఎస్టేట్స్‌, వాటి మధ్యలో పొగమంచుతో అలంకరించినట్టు ఉండే మున్నార్.. సమ్మర్ కోసం బెస్ట్ వెకేషన్‌.

కొడైకెనాల్

స‌ముద్ర మ‌ట్టానికి 2100 మీట‌ర్ల ఎత్తులో ఉండే కొడైకెనాల్‌ను 'గిఫ్ట్ ఆఫ్ ది ఫారెస్ట్' అంటారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు దగ్గర్లో ఉండే కొడైకెనాల్ సమ్మర్‌లో కూడా చల్లగా ఉంటుంది. ఎంతో ఎత్తులో సహజంగా ఏర్పడిన లేక్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్.

డార్జిలింగ్

పశ్చిమ బెంగాల్‌లో ఉండే డార్జిలింగ్ మంచు కప్పిన పర్వతాలతో ఎంతో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. హిమాలయాలకు దిగువన ఉండే డార్జిలింగ్‌లో సమ్మర్‌లో కూడా వణికించే చలి ఉంటుంది. అందుకే దీన్ని బెస్ట్ సమ్మర్ వెకేషన్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, మనదేశంలోని బెస్ట్ హనీమూన్ స్పాట్స్ లో డార్జిలింగ్ కూడా ఒకటి.

అరకులోయ

తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లో ఉన్న బెస్ట్ సమ్మర్ స్పాట్ అరకు లోయ. పచ్చని కొండలతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో సమ్మర్‌లో కూడా చల్లగాలులు వీస్తుంటాయి. ఇక్కడికి దగ్గర్లో ఉండే లంబసింగిని ఆంధ్రా కశ్మీర్ అంటారు. ఎప్పుడూ చిరుజల్లులు కురిసే ఈ ప్రాంతం.. కచ్చితంగా బెస్ట్ సమ్మర్ వెకేషన్.

కశ్మీర్

సమ్మర్‌లో కాస్త్ లాంగ్ టూర్ వేయాలనుకుంటే దానికి కశ్మీర్‌ను మించిన ఆప్షన్ లేదు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు బోలెడ్ ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి. సమ్మర్‌లో కశ్మీర్ పూర్తిగా రూపు మార్చుకుంటుంది. కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోన్‌మార్గ్ లాంటి ప్రదేశాల్లో మంచు అంతా కరిగి సరస్సుల రూపంలో ఎంతో కొత్తగా కనిపిస్తుంది.

మ‌నాలి

సమ్మర్‌లో చల్లదనంతో పాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ ను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి మనాలీ పర్ఫెక్ట్ చాయిస్. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ.. పార్టీ లవర్స్‌కు పారడైజ్ లాంటిది. సమ్మర్‌లో ఇక్కడ మంచంతా కరిగి సెలయేర్లుగా పారుతుంటుంది.

Tags:    
Advertisement

Similar News