బాదుడంటే అది.. బాబుపై అంబటి సెటైర్ల వర్షం..

బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్షం ప్రజల్లోకి వస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు చార్జీలు పెరిగాయని, మందు రేట్లు పెరిగాయని, పెట్రోల్, డీజిర్ రేట్లు ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న నిరసనలకు బాదుడే బాదుడు అనే పేరు పెట్టుకుంది. అయితే బాదుడే బాదుడు అంటే అసలు అర్థం వేరే ఉందని చెప్పారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్సార్ నుంచి మొదలైంది.. వైఎస్సార్ 2004, 2009లో చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించారని, బాదుడంటే […]

Advertisement
Update:2022-05-04 17:29 IST

బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్షం ప్రజల్లోకి వస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు చార్జీలు పెరిగాయని, మందు రేట్లు పెరిగాయని, పెట్రోల్, డీజిర్ రేట్లు ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న నిరసనలకు బాదుడే బాదుడు అనే పేరు పెట్టుకుంది. అయితే బాదుడే బాదుడు అంటే అసలు అర్థం వేరే ఉందని చెప్పారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.

వైఎస్సార్ నుంచి మొదలైంది..
వైఎస్సార్ 2004, 2009లో చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించారని, బాదుడంటే అది అని అన్నారు అంబటి. జగన్ హయాంలో.. 151 సీట్లలో ప్రజలు చంద్రబాబుకి బాదుడే బాదుడు అంటే ఏంటో మరోసారి రుచి చూపించారని, లోకేష్ ని మంగళగిరిలో బాదింది అసలు బాదుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడిని రెండు చోట్లా ఓడించి ప్రజలు బాదుడంటే ఏంటో చూపించారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీకి ఆ బాదుడు మరీ ఎక్కువైందని.. 13,081 పంచాయతీల్లో 10,536 చోట్ల వైసీపీ గెలిచిందని, 637 జడ్పీటీసీల్లో 620 వైసీపీవేనని, 75 నగర పంచాయతీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు టీడీపీ వాళ్లు ఒకే ఒకటి గెలిచారని ఎద్దేవా చేశారు అంబటి. కుప్పం మున్సిపాల్టీలో కూడా వైసీపీయే గెలిచిందని, కుప్పంలోనే చంద్రబాబు పార్టీని తుక్కు తుక్కుగా ఓడించి అసలైన బాదుడేంటో వారికి ప్రజలు రుచి చూపించారని గుర్తు చేశారు.

అసెంబ్లీకి రాకుండా జీతాలు కావాలా..?
గతంలో శాసన సభకు రానివారికి జీతాలెందుకంటూ పరాచకాలాడిన చంద్రబాబు.. ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడంలేదని నిలదీశారు అంబటి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికంటే రాష్ట్రంలో ఇప్పుడే చౌక ధరలున్నాయని చెప్పారు. మూడేళ్ల కాలంలో దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటి వల్ల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. చంద్రబాబు చెప్పే సొల్లు కబుర్లు ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. 2024లో మూడు పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Tags:    
Advertisement

Similar News