ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ..! పేరేంటంటే..?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే).. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి ఎంట్రీ కష్టసాధ్యం కావడంతో ఆయన కొత్త పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. “పదేళ్లుగా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉన్నా. ప్రజానుకూల విధానాల రూపకల్పనలో చాలామందికి సహాయం చేశా. ఇప్పుడు నేను కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. నిజమైన మాస్టర్స్.. అంటే ప్రజల వద్దకు […]
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే).. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి ఎంట్రీ కష్టసాధ్యం కావడంతో ఆయన కొత్త పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
“పదేళ్లుగా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉన్నా. ప్రజానుకూల విధానాల రూపకల్పనలో చాలామందికి సహాయం చేశా. ఇప్పుడు నేను కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. నిజమైన మాస్టర్స్.. అంటే ప్రజల వద్దకు వెళ్లే సమయం ఆసన్నమైంది. సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోడానికి జన సురాజ్ మొదలు పెట్టాల్సి వస్తోంది”. ప్రయాణం బీహార్ నుంచి మొదలవుతుంది. అంటూ ట్వీట్ చేశారు ప్రశాంత్ కిషోర్.
ఈ ట్వీట్ తో ‘జన సురాజ్’ పేరుతో ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అది కూడా బీహార్ నుంచే ఉంటుందని అంటున్నారు. గతంలో జనతాదళ్ (యునైటెడ్) పార్టీతో ఉన్న అనుబంధంతో ఆయన.. బీహార్ నుంచే తన ప్రస్థానం మొదలు పెట్టబోతున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రశాంత్ కిషోర్ నుంచి ఇప్పటి వరకూ ట్వీట్ మినహా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.
ఇప్పటికే బీహార్ లోని భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అనుకున్నా.. అది సాధ్యం కాకపోవడంతో ఆయన కొత్త ప్రయాణాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఓవైపు రాజకీయ వ్యూహాలకోసం ఇతర పార్టీలకు తన ఆధ్వర్యంలోని ‘ఐప్యాక్’ తో సేవలందిస్తూనే.. మరోవైపు నూతన రాజకీయ పార్టీతో ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది.