బాబు హయాంలో దుర్ముఖి, వికారి.. జగన్ జమానాలో శుభకృత్..

చంద్రబాబు హయాంలో తెలుగు సంవత్సరాల పేర్లు కూడా ఆయనకు తగ్గట్టే ఉండేవని, దుర్ముఖి, వికారి సంవత్సరాలు అప్పుడే వచ్చాయని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. జగన్ హయాంలో ప్లవ, శుభకృత్ వంటి శుభ సూచికాలు వస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్ళుగా చంద్రబాబుకి ఉగాది పచ్చడిలో చేదు మాత్రమే తగులుతోందని అన్నారు అంబటి. జగన్ హయాంలో వర్షాలు సమృద్ధిగా పడి, రిజర్వాయర్లన్నీ నిండి, చక్కటి వాతావరణం ఏర్పడిందని, మూడేళ్లలో లక్షా 32వేల […]

Advertisement
Update:2022-04-01 17:50 IST

చంద్రబాబు హయాంలో తెలుగు సంవత్సరాల పేర్లు కూడా ఆయనకు తగ్గట్టే ఉండేవని, దుర్ముఖి, వికారి సంవత్సరాలు అప్పుడే వచ్చాయని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. జగన్ హయాంలో ప్లవ, శుభకృత్ వంటి శుభ సూచికాలు వస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్ళుగా చంద్రబాబుకి ఉగాది పచ్చడిలో చేదు మాత్రమే తగులుతోందని అన్నారు అంబటి. జగన్ హయాంలో వర్షాలు సమృద్ధిగా పడి, రిజర్వాయర్లన్నీ నిండి, చక్కటి వాతావరణం ఏర్పడిందని, మూడేళ్లలో లక్షా 32వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు అంబటి. పరిపాలనా వికేంద్రీకరణ, జిల్లాల వికేంద్రీకరణ, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పులతో ఆంధ్ర ప్రదేశ్‌ కొత్త శోభను సంతరించుకుంటోందని అన్నారు. అందుకే టీడీపీ భరించలేకపోతుందని, వారి అడ్రస్ గల్లంతవడం ఖాయమని భయపడిపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు స్వల్పంగానే పెరిగాయని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ అని అన్నారు అంబటి. ప్రజలపై ఛార్జీల భారం మోపి నడ్డి విరగ్గొట్టినవాళ్ళు, విరగ్గొడుతున్నవాళ్ళు సీఎం జగన్ పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని, పీపీఏ ఒప్పందాల్లో కిక్ బ్యాగ్స్ తీసుకున్న చరిత్ర ఆయనిదని అన్నారు.

గత పదిరోజుల్లో 9సార్లు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను కేంద్రం పెంచిందని, దీనికి కారణం జగన్ కాదు కదా అని ప్రశ్నించారు అంబటి. ఏపీలో కరెంటు రేట్లు పెరిగాయని లోకేష్ పట్ట పగలే లాంతరు పట్టుకుని తిరుగుతున్నారని, సిలిండర్‌ ధరలు పెరిగినందుకు.. గ్యాస్ బండ పట్టుకుని తిరగలేదెందుకని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచిన కేంద్రంపై మాట్లాడాలంటే లోకేష్ కి భయమా అని అడిగారు. కారు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకు రమ్మని ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి పంపిస్తే.. పెట్రోలు బంక్‌ కి వెళ్లేలోపు ధరలు పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు అంబటి. బీజేపీ వాళ్లు కూడా కరెంటు చార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఆందోళన చేయడం హాస్యాస్పదం అన్నారు.

బీజేపీ వాళ్లే కాదు వారికి అండగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ కూడా రాష్ట్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఒకసారి పవర్‌ ఇవ్వండి నా పవర్‌ చూపిస్తానంటున్న పవన్‌ కల్యాణ్‌.. మీ పవరేంటో కేంద్ర ప్రభుత్వంపై చూపించరా, మీరు పవర్‌ స్టార్‌ కదా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే టీడీపీ, బీజేపీ, జనసేన.. ఎవరూ మాట్లాడట్లేదని, కేవలం ఏపీలో కరెంటు చార్జీలు స్వల్పంగా పెరిగితే.. రాద్ధాంతం చేస్తున్నారని, వారి అనుకూల మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు అంబటి.

విద్యుత్‌ ఛార్జీల పెంపుకి నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా వారంరోజుల పాటు కొవ్వొత్తి, అగ్గిపెట్టెలు పంపిణీ చేస్తానంటోందని, వాటితో పాటు ఒక పచ్చజెండా కూడా పంపిస్తే ప్రజలు అగ్గిపుల్లతో కొవ్వొత్తి వెలిగించి పైన పచ్చజెండా పెట్టి శుభ్రంగా కాల్చి బూడిద చేసి పంపిస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ లేదని, ఆ పార్టీ దుకాణం ఖాళీ అయిపోయిందని విమర్శించారు అంబటి.

Tags:    
Advertisement

Similar News