రాబోయే రోజుల్లో అన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలే..

గిగ్ వర్కర్, లేదా గిగ్ నమూనా. ఒకే సంస్థని నమ్ముకోరు, ఒకే యజమానికోసం పనిచేయరు. కేవలం టెంపరరీగా మాత్రమే ఆయా సంస్థల్లో ఉద్యోగం చేస్తుంటారు. అలాంటి వారందర్నీ గిగ్ వర్కర్లు అంటారు. రాబోయే రోజుల్లో భారత్ లో ప్రైవేట్ సెక్టార్ లో ఈ గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఓ సర్వే తెలిపింది. టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ.. ‘ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌-డిజిటల్‌ ఎంప్లాయ్ మెంట్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ పేరుతో తయారు చేసిన నివేదికలో 2023నాటికి భారత్ […]

Advertisement
Update:2022-03-28 03:20 IST

గిగ్ వర్కర్, లేదా గిగ్ నమూనా. ఒకే సంస్థని నమ్ముకోరు, ఒకే యజమానికోసం పనిచేయరు. కేవలం టెంపరరీగా మాత్రమే ఆయా సంస్థల్లో ఉద్యోగం చేస్తుంటారు. అలాంటి వారందర్నీ గిగ్ వర్కర్లు అంటారు. రాబోయే రోజుల్లో భారత్ లో ప్రైవేట్ సెక్టార్ లో ఈ గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఓ సర్వే తెలిపింది. టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ.. ‘ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌-డిజిటల్‌ ఎంప్లాయ్ మెంట్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ పేరుతో తయారు చేసిన నివేదికలో 2023నాటికి భారత్ లో గిగ్ నమూనా ఊపందుకుంటుందని స్పష్టమవుతోంది. ఇంజినీరింగ్‌, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని సుమారు 750కు పైగా కంపెనీల్లో టీమ్ లీజ్ సర్వే చేపట్టింది.

ఒకే కంపెనీ, ఒకే జీతం, ఒకటే ఉద్యోగం.. కరోనా తర్వాత ఇలాంటివాటికి కాలం చెల్లింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువ కావడంతో వివిధ సంస్థలు పర్మినెంట్ ఉద్యోగులకంటే, ఇలా గిగ్ వర్కర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తమ సంస్థకే పరిమితం కానవసరం లేదు, కానీ తాము చెప్పిన పని ఇన్ టైమ్ లో చేసి పెట్టాలి. ఇదీ కొన్ని కంపెనీల సిద్ధాంతం. దీనికి తగ్గట్టుగానే గిగ్ వర్కర్ల సంఖ్య కూడా భారత్ లో పెరుగుతోంది. వచ్చే ఏడాదిలో గిగ్ నమూనా 17శాతం వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. ఇలా తాత్కాలికంగా, కాంట్రాక్ట్ బేస్ లో పనులు చేయించుకోడానికి కంపెనీలు, పనిచేయడానికి అభ్యర్థులు ముందుకొస్తున్నారు.

మూడేళ్లలో భారత్ లో 1.2 కోట్ల ఉద్యోగావకాశాలు..
ఓవైపు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలంటూ ఉద్యమాల బాట పడుతుంటే, మరోవైపు ప్రైవేటు రంగంలో మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగాలకే డిమాండ్ పెరగడం విశేషం. కంపెనీలతోపాటు, ఉద్యోగులు కూడా ఇదే తరహా ఉపాధిని కోరుకుంటున్నారు. ఇక 2025-26 నాటికి ఇంజినీరింగ్‌, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కోటీ 20 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో సాంకేతికత విస్తరణ, డిజిటలీకరణతో పాటు రికవరీపై దృష్టి దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో 8.7 శాతం మంది.. అంటే 4కోట్ల 20లక్షల మంది ఈ 3 రంగాల్లో పని చేస్తున్నారు. 2026 నాటికి ఈ రంగాల్లో మరో 1.2 కోట్ల అదనపు ఉద్యోగాలు లభించే అవకాశముంది. భారత్ లో టెలికాం, ఇంజినీరింగ్‌, ఆరోగ్య సంరక్షణ రంగాల మార్కెట్‌ పరిమాణం సుమారు రూ.114 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ 3 రంగాలు కలిపి ఉద్యోగావకాశాల సృష్టిలో 25-27 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని టీమ్ లీజ్ నివేదిక చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News