ఏప్రిల్ -2నుంచి టీఆర్ఎస్ పోరుబాట..

పోరాటాల సీజన్ ప్రారంభమైందని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో పండే ధాన్యాన్నంతా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2 తర్వాత ఢిల్లీలో నిరసనకు రెడీ అవుతున్నట్టు స్పష్టం చేశారు. విభజన హామీల అమలుకోసం పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపడతారని అన్నారాయన. కేంద్రం సమర్థత సరిగా లేదని విమర్శించిన కేసీఆర్.. తాము భారతీయ రైతుల గురించి మాత్రమే […]

Advertisement
Update:2022-03-21 14:35 IST

పోరాటాల సీజన్ ప్రారంభమైందని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో పండే ధాన్యాన్నంతా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2 తర్వాత ఢిల్లీలో నిరసనకు రెడీ అవుతున్నట్టు స్పష్టం చేశారు. విభజన హామీల అమలుకోసం పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపడతారని అన్నారాయన. కేంద్రం సమర్థత సరిగా లేదని విమర్శించిన కేసీఆర్.. తాము భారతీయ రైతుల గురించి మాత్రమే అడుగుతున్నామని, అమెరికా రైతుల గురించి కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వడంలేదని, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం లేదని దుయ్యబట్టారు.

కాశ్మీర్ ఫైల్స్ తో విద్వేషాల్ని రెచ్చగొడతారా..?
కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు కేసీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడడానికి సెలవులు ఇస్తున్నారని, అసలు దేశం ఎటువైపు పోతోందని ప్రశ్నించారు. యూపీఏ బాగాలేదని బీజేపీకి అధికారం ఇస్తే అంతకంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని ఎద్దేవా చేశారు. బీజేపీ హయాంలో దేశంలో కొత్తగా ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని, ఉన్నవి అమ్మేస్తున్నారని చెప్పారు. అయితే డీమానిటైజేషన్.. లేదంటే మానిటైజేషన్ చేసుకోవాలంటున్నారని విమర్శించారు. యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ బలం తగ్గిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నిరూపితమైందని చెప్పారు కేసీఆర్.

ముందస్తు ప్రశ్నే లేదు..
గతంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని, ఈసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదని చెప్పారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కలసి పని చేస్తున్నామన్నారు కేసీఆర్. తనకి ఏడెనిమిదేళ్లుగా పీకేతో స్నేహం ఉందని, డబ్బులకోసం ఆయన ఎప్పుడూ ఎవరికోసం పనిచేయలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏదో, వేదిక ఏదో తనకు తెలియదని, చర్చలు మాత్రం జరుగుతున్నాయని చెప్పారు. చిన జీయర్ స్వామితో తనకు విబేధాలు ఉన్నాయనే వార్తలు అవాస్తవం అని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News