హన్సిక సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ […]

Advertisement
Update:2022-03-13 14:51 IST

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ…ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో ఉంటుందంటున్నారు మేకర్స్. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబీన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది హన్సిక.

Tags:    
Advertisement

Similar News