ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టేనా..?

రెండేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చేస్తానంటూ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు.. అదే సమయానికి మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని అంటున్నారు. గతంలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు మినహా.. అధికారిక సమాచారమేదీ దీనిపై ఇప్పటి వరకూ బయటకు రాలేదు. తాజాగా బడ్జెట్ సందర్భంగా జరిగిన మంత్రి వర్గ భేటీలో దీనికి సంబంధించిన చర్చ జరిగినట్టు […]

Advertisement
Update:2022-03-11 15:23 IST

రెండేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చేస్తానంటూ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు.. అదే సమయానికి మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని అంటున్నారు. గతంలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు మినహా.. అధికారిక సమాచారమేదీ దీనిపై ఇప్పటి వరకూ బయటకు రాలేదు. తాజాగా బడ్జెట్ సందర్భంగా జరిగిన మంత్రి వర్గ భేటీలో దీనికి సంబంధించిన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ మంత్రులతో కాసేపు ముచ్చటించారట. కొత్తగా ఏర్పాటయ్యే మంత్రిమండలి కోసం చాలామంది పోటీలో ఉన్నారని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.

అందరూ కొత్తవారేనా..?
ప్రస్తుతం జగన్ టీమ్ లో ఉన్నవారందరినీ మార్చేస్తారా లేక సీనియర్లకు మరోసారి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్లు కాదని, మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనంటూ సీఎం జగన్ మంత్రులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. సీఎం మాటలతో త్వరలోనే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రులుగా తొలగించినవారి సేవల్ని పార్టీకోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. వారికే జిల్లా పార్టీ వ్యవహారాలు అప్పగించే అవకాశముందని కూడా అంటున్నారు.

వైసీఎల్పీ భేటీలో క్లారిటీ వస్తుందా..?
ఈనెల 15న వైసీపీ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. అదేరోజు మంత్రి వర్గం విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలంటున్నాయి. మొత్తమ్మీద చాన్నాళ్లుగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకున్న కొంతమంది ఎమ్మెల్యేల కల త్వరలో తీరుతుందని అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News