విశాఖ స్టీల్‌పై పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖపట్నంలో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటైన స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఏపీలోని అధికార, విపక్షాలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షించేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళన కూడా ఇటీవలే ఏడాది పూర్తయింది. తాజాగా స్టీల్ ప్లాంట్‌పై దివంగత ఎన్టీఆర్ తనయ, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని పురందేశ్వరి చేసిన […]
విశాఖపట్నంలో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటైన స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఏపీలోని అధికార, విపక్షాలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షించేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళన కూడా ఇటీవలే ఏడాది పూర్తయింది. తాజాగా స్టీల్ ప్లాంట్‌పై దివంగత ఎన్టీఆర్ తనయ, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పురందేశ్వరి మాట్లాడారు. గత ప్రభుత్వాలు గనులు ఇవ్వకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే దిశగా ఏపీ పయనిస్తోందని ప్రభుత్వంపై ఆమె విమర్శలు సంధించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చే మార్గం ఎక్కడుందంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకురాలుగా ఉండి ప్రైవేటీకరణను ఆపాల్సిందిపోయి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసుగా మాట్లాడటం సరికాదని పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు.