ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్ అప్ డేట్స్

శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ఇవాళ్టితో ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌కటించారు మేక‌ర్స్‌. మ‌హాశివ‌రాత్రి స్పెషల్ గా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న థియేటర్లలోకి రాబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. ఓవైపు ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేయడంతో పాటు.. మరోవైపు లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు […]

Advertisement
Update:2022-02-14 17:06 IST

శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఇవాళ్టితో ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌కటించారు మేక‌ర్స్‌. మ‌హాశివ‌రాత్రి స్పెషల్ గా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న థియేటర్లలోకి రాబోతోంది.

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. ఓవైపు ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేయడంతో పాటు.. మరోవైపు లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం టైటిల్ సాంగ్‌, టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పెర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. వాలెంటెన్స్ డే కానుకగా దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఆద్య అనే పాటను కూడా విడుదల చేశారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి లాంటి సీనియన్లు ఇందులో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Tags:    
Advertisement

Similar News