సమంత.. మళ్లీ హాట్ టాపిక్

నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన సమంత, ఇప్పుడు అదే అంశానికి సంబంధించి మరో సంచలనానికి తెరతీసింది. తామిద్దరం విడిపోతున్నట్టు గతంలో ప్రకటించిన పోస్టును తాజాగా ఆమె డిలీట్ చేసింది. దీంతో సమంత విడాకుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. విడిపోయినట్టు చేసిన ప్రకటనను డిలీట్ చేయడంతో.. సమంత-నాగచైతన్య మరోసారి కలిసే అవకాశం ఉందంటూ కొందరు కథనాలు వండివారుస్తున్నారు. మరికొందరు మాత్రం, సమంత తన పాత జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపేసే క్రమంలో ఆ పోస్టును కూడా డిలీట్ […]

Advertisement
Update:2022-01-21 14:35 IST

నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన సమంత, ఇప్పుడు అదే అంశానికి సంబంధించి మరో సంచలనానికి తెరతీసింది. తామిద్దరం విడిపోతున్నట్టు గతంలో ప్రకటించిన పోస్టును తాజాగా ఆమె డిలీట్ చేసింది. దీంతో సమంత విడాకుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది.

విడిపోయినట్టు చేసిన ప్రకటనను డిలీట్ చేయడంతో.. సమంత-నాగచైతన్య మరోసారి కలిసే అవకాశం ఉందంటూ కొందరు కథనాలు వండివారుస్తున్నారు. మరికొందరు మాత్రం, సమంత తన పాత జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపేసే క్రమంలో ఆ పోస్టును కూడా డిలీట్ చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు నాగచైతన్య మాత్రం సమంతతో విడిపోతున్నట్టు చేసిన ప్రకటనను అలానే ఉంచాడు.

ప్రస్తుతం సమంత తన కెరీర్ పై పూర్తిగా దృష్టిపెట్టింది. పుష్ప సినిమాలో చేసిన ఐటెంసాంగ్ తో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం యశోద అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె నర్సు పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ తర్వాత ఆమె ఓ ఇంటర్నేషనల్ మూవీలో నటించనుంది.

Tags:    
Advertisement

Similar News