కరోనా నుంచి కోలుకున్న త్రిష
హీరోయిన్ త్రిష కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది ఈ చెన్నై బ్యూటీ. కొన్ని రోజులుగా ఐసొలేషన్ లో ఉంది త్రిష. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మాత్రమే తనకు వైరస్ సోకిన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు అన్ని కరోనా లక్షణాలు తనకు ఉన్నాయని, వైద్యుల సహాయంతో సక్సెస్ ఫుల్ గా కోలుకున్నానని తెలిపింది. నిన్న ఆమె మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా, టెస్టులో నెగెటివ్ వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి […]
హీరోయిన్ త్రిష కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది ఈ చెన్నై బ్యూటీ. కొన్ని రోజులుగా ఐసొలేషన్ లో ఉంది త్రిష. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మాత్రమే తనకు వైరస్ సోకిన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు అన్ని కరోనా లక్షణాలు తనకు ఉన్నాయని, వైద్యుల సహాయంతో సక్సెస్ ఫుల్ గా కోలుకున్నానని తెలిపింది.
నిన్న ఆమె మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా, టెస్టులో నెగెటివ్ వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి ఆమె తన సినిమా పనులు మొదలుపెట్టింది. ముందుగా ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు రికార్డింగ్ స్టుడియోకు వెళ్లింది. జీవితంలో తొలిసారి నెగెటివ్ అనే మాట విన్నప్పుడు చాలా ఆనందం వేసిందని ఈ సందర్భంగా ట్విట్టర్ లో పోస్టు పెట్టింది త్రిష.
తమిళనాట బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతోంది త్రిష. ఆమె చేతిలో 5 సినిమాలున్నాయి. వాటిలో 3 సినిమాల షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. మరో 2 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. తమిళనాట థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్న తర్వాత త్రిష సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయి.