రూ. 300 కోట్లు కొల్లగొట్టిన పుష్ప
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే, 16వ రోజు వచ్చిన వసూళ్లు చాలాల […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది.
మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే, 16వ రోజు వచ్చిన వసూళ్లు చాలాల ఎక్కువ. అంతేకాదు హిందీలో పుష్ప సినిమాకు హయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్ కూడా ఇదే.
ఇప్పటికే బాలీవుడ్‌లో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప సినిమా. అక్కడ ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.56 కోట్లు వచ్చాయి. 75 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతుంది పుష్ప. ఇదే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప.
ఓవరాల్‌గా ఇప్పటివరకు పుష్ప సినిమాకు 300 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫుల్ రన్‌లో సినిమా 350 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నార్త్ లో ఈ సినిమా కేజీఎఫ్ ను కూడా క్రాస్ చేసింది.