ఈసారి హ్యాట్రిక్ కొడతారంట..!

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సినిమా లాంఛ్ అయింది కూడా. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌, ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ […]

Advertisement
Update:2021-12-25 14:22 IST

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సినిమా లాంఛ్ అయింది కూడా.

గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌, ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. టీజీ వెంకటేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

భూపతి రాజా అందించిన ఈ కథకు, శ్రీవాస్ తనదైన మార్పుచేర్పులు చేశాడు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. రాశిఖన్నాను రిపీట్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

2007లో గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో లక్ష్యం వచ్చింది. ఆ తర్వాత ఏడేళ్లకు లౌక్యం వచ్చింది. మళ్లీ సరిగ్గా ఏడేళ్లకు మరో సినిమాతో వీళ్లిద్దరూ కలిశారు. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అట ఇది.

Tags:    
Advertisement

Similar News