తన ప్రేమకథను పుష్పలో పెట్టిన సుకుమార్

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ ట్రాక్ చాలామందిని ఎట్రాక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. తన జీవితంలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నుంచి ఆ లవ్ ట్రాక్ రాసుకున్నానని తెలిపాడు. “మా ఆవిడకు, నాకు మధ్య కొన్ని సంఘటనలున్నాయి. అవన్నీ నేను బయటకు చెప్పలేను. ఆ సంఘటనల స్ఫూర్తితోనే పుష్ప-శ్రీవల్లి లవ్ ట్రాక్ రాసుకున్నాను. రిలీజ్ తర్వాత పొద్దున్నే నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు, బయట […]

Advertisement
Update:2021-12-20 13:20 IST

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ ట్రాక్ చాలామందిని ఎట్రాక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. తన జీవితంలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నుంచి ఆ లవ్ ట్రాక్ రాసుకున్నానని తెలిపాడు.

“మా ఆవిడకు, నాకు మధ్య కొన్ని సంఘటనలున్నాయి. అవన్నీ నేను బయటకు చెప్పలేను. ఆ సంఘటనల స్ఫూర్తితోనే పుష్ప-శ్రీవల్లి లవ్ ట్రాక్ రాసుకున్నాను. రిలీజ్ తర్వాత పొద్దున్నే నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు, బయట నుంచి డోర్ కొట్టి మరీ కాపీ కొట్టేశావ్ అంటూ నా భార్య నన్ను తిట్టింది. గతంలో మా లైఫ్ లో జరిగిన కొన్ని సీన్ల నుంచి కాపీ కొట్టి లవ్ ట్రాక్ రాశాననే విషయం నా భార్య నన్ను తిట్టినంతవరకు గుర్తురాలేదు.”

ఇలా పుష్ప లవ్ ట్రాక్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు సుకుమార్. మరోవైపు ఈ సినిమాను ముందుగా వెబ్ సిరీస్ గా అనుకున్న విషయాన్ని కూడా వెల్లడించాడు ఈ దర్శకుడు.

“ముందు వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాను. అందుకే చాలా రీసెర్చ్ చేశాం. బన్నీతో సినిమా అనుకున్నప్పుడు ముందుగా క్యారెక్టర్ అనుకున్నాను. తర్వాత బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేశాను. ఈ రెండే బన్నీకి చెప్పాను. మొదటి రోజు బన్నీకి క్యారెక్టరైజేషన్ ఏం చెప్పానో, ఇప్పుడు మీరు చూస్తున్న పుష్పరాజ్ గెటప్ అదే.”

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మరోవైపు యూనిట్ మాత్రం తమ ప్రచారాన్ని ఆపలేదు. వరుసగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేసింది. ఈ వీకెండ్ పెద్ద సక్సెస్ మీట్ కూడా ఏర్పాటుచేయబోతున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News