పుష్ప 3 రోజుల వసూళ్లు
అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో హౌజ్ ఫుల్ వసూళ్లలో నడుస్తోంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 173 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇదేనంటూ క్లయిమ్ చేసుకుంది పుష్ప యూనిట్. తెలుగు రాష్ట్రాల్లో 101 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే, 3 రోజుల్లోనే ఈ […]
అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా థియేటర్లలో హౌజ్ ఫుల్ వసూళ్లలో నడుస్తోంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 173 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇదేనంటూ క్లయిమ్ చేసుకుంది పుష్ప యూనిట్.
తెలుగు రాష్ట్రాల్లో 101 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే, 3 రోజుల్లోనే ఈ సినిమా సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. ఇదే ఊపు కొనసాగితే మరో 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకొని, లాభాల్లోకి అడుగుపెడుతుంది పుష్ప.
అటు నార్త్ లో కూడా పుష్ప హవా కొనసాగుతోంది. ఈ 3 రోజుల్లో సినిమాకు 12 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 28.50 కోట్లు
సీడెడ్ – రూ. 8.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.40 కోట్లు
ఈస్ట్ – రూ. 3.03 కోట్లు
వెస్ట్ – రూ. 2.62 కోట్లు
గుంటూరు – రూ. 3.49 కోట్లు
నెల్లూరూ – రూ. 1.95 కోట్లు
కృష్ణా – రూ. 2.72 కోట్లు