పుష్ప మూవీ 4 సినిమాలతో సమానం

బన్నీ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటున్నాడు అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే, 4 సినిమాల కష్టాన్ని ఈ ఒక్క సినిమా కోసమే పడినట్టు చెప్పుకొచ్చాడు. పుష్ప ఒక్కటి తనకు 4 సినిమాలతో సమానం అన్నాడు. ఇక అప్ కమింగ్ మూవీస్ పై స్పందిస్తూ.. తన పుష్పతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్నాడు. “మొన్న విడుదలై అద్భుతమైన విజయం సాధించిన అఖండ టీమ్ అందరికీ కంగ్రాట్స్. […]

Advertisement
Update:2021-12-13 10:26 IST

బన్నీ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటున్నాడు అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే, 4 సినిమాల కష్టాన్ని ఈ ఒక్క సినిమా కోసమే పడినట్టు చెప్పుకొచ్చాడు. పుష్ప ఒక్కటి తనకు 4 సినిమాలతో సమానం అన్నాడు. ఇక అప్ కమింగ్ మూవీస్ పై స్పందిస్తూ.. తన పుష్పతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్నాడు.

“మొన్న విడుదలై అద్భుతమైన విజయం సాధించిన అఖండ టీమ్ అందరికీ కంగ్రాట్స్. పుష్పతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్యతో పాటు మధ్యలో వచ్చే సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను..”

పుష్ప సినిమాలో రష్మికతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను బయటపెట్టాడు బన్నీ. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందన్నాడు. రష్మికను ముద్దుగా కస్మిక అని పిలుస్తాడట బన్నీ. ఆమెలో చాలా టాలెంట్ ఉందని, సరైన కథలు, డైరక్టర్లు పడితే ఇంకా ఎత్తుకు ఎదుగుతుందని మెచ్చుకున్నాడు బన్నీ.

తనకు సపోర్ట్ గా నిలిచిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. అందరికీ ఫ్యాన్స్ ఉంటారని, తనకు మాత్రం ఆర్మీ ఉందని చెప్పుకొచ్చాడు. నిన్న పుష్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Tags:    
Advertisement

Similar News