బింబిసార టీజర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథలాజికల్ టచ్ తో సాగే బింబిసార సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కళ్యాణ్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథలాజికల్ టచ్ తో సాగే బింబిసార సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కళ్యాణ్ రామ్, బింబిసారతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్తగా ఉన్నాయి. క్రూరుడైన బింబిసారుడు యుద్ధ రంగంలో శత్రు సైనికులను చంపే విజువల్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ టెరిఫిక్‌గా ఉన్నాడు. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇలాంటి మైథిలాజికల్ పాత్రలో నటిస్తుండటంతో పాటు, ఆ పాత్ర లుక్, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక టీజర్ చివర్లో మోడ్రన్ లుక్ లో కల్యాణ్ రామ్ ను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయాన్ని బయటపెట్టారు మేకర్స్. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.